* యువతకు బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచన
వేగంగా లక్ష్యాలు చేరాలనే ఆరాటంలో నేటి యువత ఉందని నితిన్ పేర్కొంటూ ఏ పనినైనా, ఓపిక, నిలకడ,శక్తితో చేసినప్పుడే ఫలితాలు వస్తాయని, నేటి యువత ఎప్పుడూ వాస్తవికత గుర్తించి పనిచేయాలని బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ వీబీఐటీ క్యాంపస్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొంటూ రీల్స్, షార్ట్స్ చూసి ఎవరూ నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకోండని చెప్పారు.
వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోండని, పని మొదలు పెట్టండని చెబుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, వచ్చాక ఏం చేస్తారో స్పష్టత ఉండాలని పేర్కొన్నారు. గతంలో తమ హక్కుల గురించి ప్రజలకు అంతగా తెలిసేది కాదని, సోషల్ మీడియా వచ్చాక ప్రజల్లో చైతన్యం పెరిగిందని చెప్పారు. హక్కుల, విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెబుతూ పార్టీలు, ప్రజా ప్రతినిధులుగా, మనం ఏదైనా చెప్పి, ప్రజలు దానిని మరచిపోయేలా చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
ప్రజలు అన్నీ అంశాలు గుర్తుంచుకుని సరైన సమయంలో తిరిగి ప్రతిస్పందస్తారని జవాబిచ్చారు. ఇది తనతో పాటు బీజేపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారని కేయూ విద్యార్థి శ్రీజ నితిన్ నబీన్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందిస్తూ చగా చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, మొదట్లో తన భవిష్యత్తుపై అంతా గందరగోళంగా ఉండేవాడినని చెప్పారు.
ఏ పని చేసినా తనదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నట్లు పేర్కొన్నారు. జీవితం వంద మీటర్ల పరుగు పందెం కాదని మన ఓపికకు పరీక్ష అని తెలిపారు. అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే తన ప్రధాన బలమని పేర్కొన్నారు. 2014కు ముందు యువతలో నిరాశ, అనిశ్చితి ఎక్కువగా కనిపించేది. ఎటు చూసినా ప్రతికూల వాతావరణమే కనిపించేదని గుర్తు చేశారు.
ఉగ్రవాద దాడులు, అవినీతి, విధానపరమైన స్థబ్దత, స్పష్టమైన దిశ లేకపోవడం, దేశానికే దిశ కనిపిన పరిస్థితులు ఉండడంతో యువత కూడా తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉండేవారని తెలిపారు. ఒక కుటుంబానికి నాయకత్వం వహించే వ్యక్తికే స్పష్టమైన దిశ లేకపోతే, ఆ కుటుంబంలోని పిల్లలు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోతారని స్పష్టం చేశారు.
కానీ నేడు ఆ నిరాశ ఆశగా మారింది. అనిశ్చితి ఆత్మవిశ్వాసంగా మారిందని, భారతదేశానికి ఇప్పుడు దృఢమైన, నిర్ణయాక నాయకత్వం ఉందని చెప్పారు. కాంక్లేవ్‌లో నల్సార్, ఐఎస్‌బీ, హెచ్‌సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

More Stories
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
పాస్‌పోర్ట్, పౌరసత్వంపై ప్రజలను తప్పుదోవ పట్టించకండి ఒవైసీ