తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం

2014 నుంచి 2018 వరకు నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు  రక్షణ ఉత్పాదక శాఖ  అదనపు కార్యదర్శిగా పనిచేశారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ రంగంలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మొన్నటి వరకు నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో మూసీ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు త్వరితగతిన సాధించడమే లక్ష్యంగా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తోంది. 

సంజయ్ జాజూ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో  దేశంలోనే తొలిసారిగా ‘సౌకర్యం’ ప్రాజెక్టు ద్వారా మున్సిపల్ సేవలను ఆన్‌లైన్ చేశారు. saukaryam. org వెబ్‌సైట్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులు, బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, వాటర్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతలు ఇవ్వడం లాంటి సేవలను అందించారు. ఇది దేశంలోనే అత్యుత్తమ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌గా అవార్డును సొంతం చేసుకుంది. 
 
స్టాక్‌హోమ్ ఛాలెంజ్ అవార్డు సైతం ఈ ప్రాజెక్టుకు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఆయన ఈ-సేవ విధానాన్ని ఆయన గ్రామీణ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా విస్తరించారు.  ఏపీ ఐటీ శాఖ కార్యదర్శిగా ‘మీసేవ’ ప్రాజెక్టుకు ఆయనే రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేశారు.  

About The Author