బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వెల్లడించారు. జూన్ 28న శంషాబాద్ చేరుకునే నితిన్ నబిన్ అక్కడి రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. రెండవ రోజు ఉదయం విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్క్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ వెళ్లే మార్గంలో భువనగిరిలో ఘనస్వాగతం అందుకుంటారని తెలిపారు.
వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. మూడవ రోజు ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు,
ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉద్దేశించినదే తప్ప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. నితిన్ నబిన్ పర్యటన కూడా రాష్ట్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని రామచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
అమ్మాయిలూ జాగ్రత్త!.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల!!
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ