* సరిహద్దు వద్ద ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్ స్వాధీనం
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సానుభూతిపరులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్, కిష్ట్వారా జిల్లాలోని, దచ్చన్ ఏరియాలో పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. అనేక ప్రాంతాలో సోదాలు నిర్వహించారు. నిఘా పెంచారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మరోవంక, భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది.
భారత్-పాక్ సరిహద్దు సమీపంలో డ్రోన్ ద్వారా ఆయుధాలు జారవిడిచినట్లు బీఎస్‌ఎఫ్‌కు సమాచారం అందడంతో స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ పోలీసులతో కలసి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒక అనుమానిత కారును అడ్డుకుని తనిఖీ చేయగా ఏకే 47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలు, 368 లైవ్ కాట్రిడ్జ్‌లు, 48 మ్యాగజైన్‌లు, అమెరికాలో తయారైన ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ కారులో ఉన్న అమృత్‌సర్‌లోని రూప్‌నగర్ కాలనీకి చెందిన నిందితుడు రోహన్ ఖోస్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన సహచరుడి ఆదేశాల మేరకు నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు.

More Stories
నీట్ లీకేజీ ఆందోళనకారులపై చర్యలు వద్దని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
కావేరీ నదీ జలాల వివాదంలో కర్ణాటకకు భారీ ఎదురుదెబ్బ
`వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ కూడా ఆమోదం