రాజ్యసభ తర్వాత, జాతీయ గీతం ‘వందేమాతరం’ను అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. చట్టంగా మారడానికి ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అంతకుముందు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో మాట్లాడుతూ, “వందేమాతరం బిల్లు కేవలం ఒక సాధారణ బిల్లు మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆత్మకు, జాతీయ చైతన్యానికి మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ, స్వాతంత్ర్య పోరాటాన్ని మనకు గుర్తుచేస్తుంది” అని పేర్కొన్నారు.
వందేమాతరం బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, “కొంతమంది వందేమాతరాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దీనిని ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావడం లేదు. ఈ బిల్లు ద్వారా జాతీయ గీతాన్ని అవమానించిన వారికి శిక్ష విధించే నిబంధనలపై చర్చ జరిగింది.
వందేమాతరాన్ని వ్యతిరేకించడం అంటే, బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తూ దేశ గౌరవాన్ని కించపరిచేలా కాంగ్రెస్ ఎప్పుడూ వ్యవహరిస్తోందని అర్థం. కాంగ్రెస్,దాని మిత్రపక్షాలు ఎందుకు నిరసన తెలుపుతున్నాయి?” అని ప్రశ్నించారు.
రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని అవమానించిన వారికి ప్రస్తుతం గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇకపై జాతీయ గేయాన్ని అవమానించిన వారికి కూడా ఇదే శిక్ష పడేలా చట్టంలో మార్పులు చేశారు.

More Stories
పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదు
‘వందేమాతరం’ను అవమానించడం నేరం.. రాజ్యసభలో బిల్లు ఆమోదం