తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పాలని బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు నిలదీశారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కొన్ని వందలసార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టడం లేదా? అని ప్రశ్నించారు.
అలా అయితే పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఇక్కడ తెలంగాణలో ప్రెస్‌మీట్‌లు పెట్టొదా? అని రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బీఆర్ఎస్ సభలు పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ సభ పెట్టినంత మాత్రాన ఎవరి ఉనికి ఎవరికీ ప్రమాదం కాదని హితవు పలికారు. చివరికి ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పారు. జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, హైకోర్టులో అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సభను రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే మీడియా సమావేశం చేయడంపై కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడంపై ఆయన విరుచుకుపడ్డారు.

More Stories
అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం
తెలంగాణాలో అడ్డుకోవడంపై రాహుల్, ప్రియాంక స్పందించాలి
తెలంగాణ ఆవిర్భావోత్సవం.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు