రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా అవతరించింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్‌గా అవతరించింది.
గుజరాత్ టైటాన్స్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. విరాట్ కోహ్లీ (75), వెంకటేశ్ అయ్యర్ (32) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో జీటీ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా బెంగళూరు జట్టు స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది.
దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్లో ఇదే గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే 24 బంతుల్లో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్కే రికార్డును రజత్ పాటిదార్ సేన బ్రేక్ చేసింది.
బౌలర్ల అటాకింగ్, కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలతో గుజరాత్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి ఐపిఎల్-2026 కీర్తి కిరీటాన్ని బెంగళూరు మరోసారి కైవసం చేసుకుంది. నిన్నటి వరకు ‘ఈసాల కప్ నామ్దే (ఈసారి ట్రోఫీ మాదే)’ అన్న అభిమానులు.. ఇప్పుడు గర్వంగా ‘ఈసాల కూడా కప్ నామ్దే’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి.. గుజరాత్ టైటాన్స్‌ను 155 పరుగులకే కట్టడి చేసింది.
లక్ష్య సాధనలో జాగ్రత్తగా ఆడుతూ ఐదు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లకు 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ ఒక్కో వికేట్ తీశారు. ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే కట్టడి చేశారు. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ గుజరాత్ టైటాన్స్ జట్టును వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు.
బాధ్యతాయుతంగా ఆడిన సుందర్ 50 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మిగతా బ్యాటర్లలో నిశాంత్ సింధు (20), జోస్ బట్లర్ (19), అర్షద్ ఖాన్ (15) పర్వాలేదనిపించినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. స్టార్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (12), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (7), జేసన్ హోల్డర్ (7) వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.
ఆర్సీబీ బౌలర్లలో యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా సీనియర్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లతో రాణించగా, కృణాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. 19ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్‌గా నిలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో ధోనీ నాయకత్వంలోని సీఎస్కే జట్టు 2010, 2011 సీజన్లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్ 2019, 2020 ఎడిషన్లలో టైటిల్ ముద్దాడింది.

More Stories
మమతా బెనర్జీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా
మీడియా విఫలమైతే బొద్దింకల వెంట యువత
6 నుండి 23 నెలల వయస్సు గల పిల్లల్లో పౌష్టికాహార లోపం