
తమ దేశపు పొరుగుదేశం (పాకిస్థాన్) ఉగ్రవాద జన్మస్థలం అయిందని పేర్కొంటూ పాకిస్థాన్‌ను ఉపేక్షించడం అమానుషానికి తావు ఇచ్చినట్లే అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోటానుకోట్ల మంది భారతీయుల ఉనికి, ఆత్మ, మర్యాదలపై జరిగిన ప్రత్యక్ష దాడి పహల్గాం ఉదంతం అని చెబుతూ ఉగ్రవాదం నిరోధక చర్యలలో ద్వంద్వ ప్రమాణాలు తగవని హెచ్చరించారు. సమన్యాయం పాటించి, తగు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చెప్పారు.
కెనడాలో జరుగుతున్న జి 7 దేశాల సదస్సు సందర్భంగా నాయకుల ఔట్‌రీచ్ సదస్సులో మాట్లాడుతూ గ్రవాద సవాళ్ల పట్ల నిర్లక్షం వహిస్తే అది మానవతకు ద్రోహం చేసినట్లే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఉగ్రవాద సమస్యలను ఉపేక్షించడం తగదని హితవు చెప్పారు. సమన్యాయం పాటించి, తగు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చెప్పారు. తనకు అర్థం కాని విషయం ఒక్కటే ఉగ్రవాద వ్యాప్తికి పాల్పడుతున్న వారిని, ఉగ్రవాద బాధిత పక్షాలను ఒకే తాసులో ఉంచి చూస్తారా? అని ప్రశ్నించారు.
ప్రపంచంలో ఇంధన భద్రతపై ప్రధాని మోదీ జి 7 నేతలతో అనుసంధాన ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండే అన్ని దేశాలకు ఉగ్రవాదం శత్రువు అవుతుందని, మొత్తం మానవాళికి ఇది చేటు కలిగిస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో, ఏ రీతిలో సమర్థించినా అటువంటి దేశాలపై జవాబుదారి అయ్యేలా చూడాలని, తగు మూల్యం చెల్లించుకుని తీరాల్సిందే అని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి ఉగ్రవాదం అణచివేత అత్యవసరం అని చెప్పారు.. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యలకు దిగుతున్న దేశాల పట్ల ఎటువంటి చర్యలు లేకపోవడం దారుణం అని మండిపడ్డారు. మనం ఓ వైపు కొన్ని విషయాలలో మన ప్రాధాన్యతలు, ప్రయోజనాల కోణంలో ఆలోచించుకుని వెంటనే ఆంక్షలకు ఇతరత్రా చర్యలకు దిగుతామని, అయితే ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు తెలిపే దేశాలపై చర్యలు ఉండవని విస్మయం వ్యక్తం చేశారు.
పైగా వాటికి నజరానాలు అందిస్తుంటారని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ప్రశ్నలు లేవనెత్తారు. నజంగానే మనకు ఉగ్రవాద అణచివేత చర్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామా? ఉగ్రవాదం పిడుగు మన నెత్తిపై పడితే కానీ దీని గురించి అందరికి అర్థం కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదం అణచివేత చర్యల్లో బాధిత పక్షాలకు సరైన న్యాయం జరుగుతోందా? ఉగ్రవాదం అణచివేతలో ప్రపంచ స్థాయి సంస్థలు, వ్యవస్థలు సరైన విధంగా పనిచేస్తున్నాయా? విశ్వసనీయత అంటూ ఉందా? అని నిలదీశారు.
ఇక్కడి చర్చనీయాంశం అయిన ఇంధన భద్రత గురించి ఆయన మాట్లాడుతూ భవిష్య తరాలకు ఇంధన భద్రత కల్పించడం అనేది అత్యంత కీలకమైన సవాలు అని పేర్కొన్నారు. రేపటి తరాలకు ఇంధన భద్రత విషయంలో మనం కేవలం నేను అనుకోకుండా, మన అని భావించుకుని, సమిష్టి ప్రాతినిధ్యంతో వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులలో గ్లోబల్ సౌత్ దేశాలు పలు అనిశ్చితలు, ఘర్షణలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ప్రపంచంలో ఏ మూల ఎటువంటి ఉద్రిక్తత నెలకొన్నా దీని ప్రభావం ప్రత్యేకించి ఈ గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్రస్థాయిలో పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన రంగ సంబంధిత విషయాలను ఆయన విశ్లేషిస్తూ సాంకేతిక మార్పులు అనేకం జరుగుతున్నాయని చెప్పారు. వినూత్న రీతిలో మనకు అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేధ (ఏఐ)నిస్సందేహంగా ఉపయుక్తంగా ఉంటోందని తెలిపారు. అన్ని రంగాలలో సమర్థత పెంపుదల, సృజనాత్మక ఆవిష్కరణలకు ఇది ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఇది అత్యంత శక్తివంతమైన కత్తిమీద సాములాంటిది కూడా అవుతోందని స్పష్టం చేశారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్