
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి ప్రయాణమైన ఎయిరిండియా విమానం మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండయ్యింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించేసి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు.
ఇంకోవైపు, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలోనూ పలు సమస్యలు వచ్చాయి. ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో డీజీసీఏ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రతినిధులతో మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. నిర్వహణా సామర్థ్యంపై సమీక్షించింది.
అవన్నీ భద్రతా పరమైన తనిఖీలకు అనుగుణంగానే ఉన్నాయని, బోయింగ్ 787 విమానాల నిఘాలో ఎలాంటి పెద్ద భద్రతా సమస్యలు తలెత్తలేదని డీజీసీఏ తెలిపింది. ఎయిర్ ఇండియా వద్దనున్న బోయింగ్ 787 రకం విమానాలన్నింటి నిర్వహణ వ్యవస్థలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన మరుసటి రోజే (జూన్ 13న) ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్‌కు చెందిన అన్ని విమానాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని నిర్దేశించింది.
దీంతో ఎయిరిండియా వద్దనున్న బోయింగ్ 787-8 రకానికి చెందిన 26, బోయింగ్ 787-9 రకానికి చెందిన 7 విమానాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు జరుగుతుండటం వల్లే జూన్ 12 నుంచి జూన్ 17 వరకు బీ787 రకం విమానాలతో నడిచే 66 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ వ్యవధిలో బీ787 రకానికి చెందిన విమానాలతో 248 సర్వీసులను ఎయిరిండియా నడిపింది.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి