
హజ్‌యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
గతంలోని సంప్రదాయం ప్రకారం హజ్ సమయంలో రద్దీని నివారించడానికి దేశం స్వల్పకాలిక వీసాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, సౌదీ అరేబియా భారత్‌తో సహా అనేక దేశాలకు బ్లాక్ వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిందని పలు నివేదికలు తెలిపాయి. హజ్‌యాత్ర సమయంలో రద్దీని నివారించడానికి స్వల్పకాలిక వీసాలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ, యాత్ర ముగిశాక ఈ ఆంక్షలను సైతం తొలగించనున్నారు.
హజ్ సందర్భంగా జూన్ జూన్ 30 వరకు సౌదీ అరేబియా 14 దేశాల వర్క్ వీసాలను రద్దు చేసిందని పలు నివేదికలు తెలిపాయి. ఈ దేశాల జాబితాలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, యెమెన్, మొరాకో, నైజీరియా, ఇథియోపియా, సూడాన్, ట్యునీషియా తదితర దేశాలున్నాయి. ఈ ఏడాది జరుగనున్న యాత్ర కోసం భారత్ నుంచి 1.75లక్షల మంది హజ్‌కు వెళ్లనున్నారు. ఈ సారి భారత్‌కు 1,75,025 మందికి అవకాశం కల్పించారు.
ఈ ఏడాది జనవరి 13న ప్రధాన ఒప్పందంపై జెడ్డాలో భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా సంతకం చేశారు. ముస్లింలు చాలా మంది జీవితంలో ఒకసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ యాత్రలో అల్లాను క్షమాపణలు కోరుకుంటారు. అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన వేడి, కఠినమైన నియమాల కారణంగా చాలా మంది హజ్ చేయలేకపోయారు.
More Stories
2024లో తీవ్ర స్థాయికి బాలలపై హింస
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!