
పథకంలో భాగంగా బెంగళూరుకు సుమారు 4,500 బస్సులు, ఢిల్లీకి 2,800, హైదరాబాద్‌కు 2వేలు, అహ్మదాబాద్‌కు వెయ్యి, సూరత్‌కు 600 బస్సులు అందించనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సుస్థిర పట్టణ రవాణా దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.
బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు, నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా, సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చురుగ్గా స్వీకరిస్తున్నాయని, తాము కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ స్పృహతో భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం ఈ-డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి తెలిపారు.
పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2026 వరకు రెండేళ్ల కాలంలో రూ.10,900 కోట్ల ఆర్థిక వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద డిమాండ్ ఇన్సెంటివ్‌ను పొందేందుకు ఈవీ కొనుగోలుదారులకు ఈ-వోచర్స్‌ను సైతం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కోసం చెరో రూ.500 కోట్లు కేటాయించింది.
More Stories
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్
బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ