
అవుట్‌డోర్ ప్రాంతాల్లో నిర్వహించే అందాల పోటీల ఈవెంట్స్‌ను డేగ కండ్లతో నిశితంగా గమనించాలని ఆదేశించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత కల్పించడం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్ కానున్నది.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పోటీదారులకు బస ఏర్పాటుచేసిన హోటల్‌లోనే పోలీసులు కూడా ‘‘మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్’’ను ఏర్పాటు చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్స్‌ను రంగంలో దించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు ఐటీ విభాగం కీలకంగా ఉండగా, దాదాపు 40 మంది వివిధ పనుల బాధ్యతలను చూస్తున్నారు. మరోవైపు హోటల్‌తో పాటు గచ్చిబౌలి ప్రాంతంలో డోన్లను వినియోగించేందుకు అవకాశం లేకుండా ‘‘నో డ్రోన్’’ జోన్‌గా ప్రకటించారు.
మిస్ వరల్డ్ పోటీలను స్లీపర్‌సెల్స్ టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నదని, ఆయా దేశాల నుంచి వచ్చిన సుందరాంగులు, విదేశీ మీడియా ప్రతినిధుల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్స్ కదలికలపై గట్టి నిఘా పెట్టాలని సూచించినట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల అనంతరం సుందరాంగులంతా 12వ తేదీ నుంచి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్‌బజార్, వరంగల్ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రూపొందించింది.
More Stories
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్
బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ