
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మానికి ఆంజనేయస్వామి ఒక రక్షణ కవచం.. ఆంజనేయ స్వామి అంటేనే ఆత్మ విశ్వాసం.. ధైర్యం.. సాహసం.. ఏదైనా సాధించగలం అనే నమ్మకమని చెప్పారు. జై భజరంగబలి అని నినదీస్తే ప్రతి హిందువు గుండె ఉప్పొంగుతుందని తెలిపారు. ఈ వేద భూమిలో, ధర్మ భూమిలో కోటి దేవతల ఆశీర్వాదంతో భారతీయులుగా ఉన్నామంటే మన అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు.
ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఈ సనాతన ధర్మంలో హిందువుగా పుట్టడంమనది జన్మజన్మల సుకృతమని అరవింద్ వివరించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ఫ్లై ఓవర్లు, పసుపు బోర్డు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని చెప్పారు. వీరహనుమాన్ విజయ యాత్ర విజయవంతం చేసిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, వీహెచ్పి, వివిధ హిందూ సంఘాలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు