
కలకలం రేపుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ 10,000 కోట్ల కుంభకోణంకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అందులో ఓ బిజెపి ఎంపీ ప్రమేయం ఉందని బిఆర్ఎస్ నేత కెటి రామారావు చేసిన ఆరోపణల పట్ల బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డి కె అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆ ఎంపీ ఎవ్వరో పేరు చెప్పాలని ఆమె సవాల్ చేశారు.
ఈ కుంభకోణంలో ఓ బిజెపి ఎంపీ రేవంత్ రెడ్డికి ఓ బ్రోకర్ కంపెనీని ఏర్పాటు చేసారని కూడా కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే ఆ బిజెపి ఎంపీ ఎవరో చెప్పాలని వారి పేరు వెల్లడించాలని అరుణ డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆ ఎంపీ ఎవరో చెప్పకుండా ఓ ఎంపీ అంటూ గాలి మాటలు మాట్లాడితే సరిపోదని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటేనని అందుకే తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి వెళ్లారని ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధి మాత్రమే అధికారంలో ఉండాలని అనుకుంటున్నారని అంటూ డీకే అరుణ విమర్శలు గుర్తించారు.
ఏపీలో మళ్ళీ ఎన్డీయే సర్కార్ ఏర్పడడంతో ఇక దక్షిణాది పైన బీజేపీ దృష్టి సారించిందని డీకే అరుణ తెలిపారు. లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచామని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, ఏపీలో మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి స్వతంత్రంగా అధికారంలోకి రాబోతుందని డీకే అరుణ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో విజయ కేతనం ఎగుర వేసేది బిజెపి నేనని డీకే అరుణ స్పష్టం చేశారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు