
ఖగోళ ప్రియులను ఈ ఏడాది సూర్య, చంద్రగ్రహణాలు కనువిందు చేయనున్నాయి. రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనునున్నాయి. ఈ నెల 14న తొలి చంద్రగ్రహణం ఏర్పడగా, మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగియనున్నది. ఈ గ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం లేదు.
బెర్ముడా, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్‌ల్యాండ్, ఫిన్లాండ్, బార్బడోస్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, కెనడా తూర్పు ప్రాంతాలు, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, లిథువేనియా, హాలండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాతాల్లో కనిపించనున్నది.
దాదాపు 100 సంవత్సరాల తర్వాత 29న అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఏర్పడనుండగా.. ఆస్ట్రేలియా, అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఈ నెల 29న ఏర్పడనున్న గ్రహణం ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర ఆసియా, దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు గ్రీన్‌లాండ్ పాక్షికంగా కనిపిస్తుందని, పశ్చిమ ఐరోపాలో మధ్యాహ్నం, ఆఫ్రికాలో ఉదయం, తూర్పులో యూరప్‌లో సాయంత్రం సమయంలో గ్రహణం కనిపించనున్నది.
అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం 4.50 గంటలకు పాక్షిక గ్రహణం మొదలవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది. ఉదయం 6.47 గంటలకు గరిష్ఠానికి చేరుతుందని, ఉదయం 8.43 గంటలకు ముగుస్తుందని పేర్కొంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు గరిష్ఠానికి చేరుకోనున్నది.
పలు ప్రదేశాల్లో సూర్యుడు 93 శాతం వరకు వరకు కనిపించడని పేర్కొంది. భూమి, సూర్యుడి మధ్యలోకి చంద్రుడు వచ్చిన సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం