హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా 

హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా 
హిందూ సమాజాన్ని పునరుజ్జీవింప చేయడమే గత వందేళ్లుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండాగా ఉందని సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు. సంఘ్ ఎజెండా హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం అని పేర్కొంటూ అంటరానితనం వంటి అనేక అంతర్లీన లోపాల కారణంగా ఇది ఒక కఠినమైన కార్యమని తెలిపారు.
 
బెంగుళూరులో మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా మీడియా సమావేశంలో సంఘ్ శత శతాబ్ది లక్ష్యాలను వివరిస్తూ సామరస్యపూర్వక సమాజం, దేశం కోసం అందరినీ ఏకం చేసే శాఖలు, తన దేశవ్యాప్త కార్యకలాపాల ద్వారా సంఘ్ అదే సాధించడానికి స్థిరంగా పనిచేస్తోందని వివరించారు.
 
దేశంలోని ప్రతి మూలను చేరుకోవడంలో సంఘ్ విజయవంతమైందని చెబుతూ సంఘ్ దేశాన్ని ఏకం చేయడానికి మాత్రమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఉపశమనం, పునరావాస కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం విజయదశమి రోజున సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి కుంటున్న సందర్భంగా రాబోయే సంవత్సరం తన కార్యం  పని విస్తరణ, ఏకీకరణపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.
 
సంఘ్ ఉద్దేశ్యం ఈ సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడంగా కాకుండా 1. ఆత్మపరిశీలన, 2. సంఘ్ పనికి సమాజం ఇచ్చిన మద్దతును గుర్తించడం 3. దేశ లక్ష్యానికి, సమాజాన్ని వ్యవస్థీకరించడానికి మమ్మల్ని మేము తిరిగి అంకితం చేసుకుంటామని ఆయన వివరించారు. శతాబ్ది సంవత్సరంలో మరింత జాగ్రత్తగా, గుణాత్మకంగా, సమగ్రంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 
 
డాక్టర్ హెడ్గేవార్ సంఘ్ ను ప్రారంభించే సమయంలో చెప్పినట్లుగా, సంఘ్ ఏ కొత్త పనిని ప్రారంభించడం లేదుని, కానీ అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్న లక్ష్యాన్ని కొనసాగిస్తోందని దత్తాత్రేయ హోసబలే  స్పష్టం చేశారు. రానున్న విజయదశమి రోజు నుండి, సంఘ్ శతాబ్ది సందర్భంగా నిర్దిష్ట కార్యకలాపాలపై సంఘ్ దృష్టి పెడుతుందని తెలిపారు.
 
1. శతాబ్ది సంవత్సరం 2025 విజయదశమి సందర్భంగా ప్రారంభమవుతుంది, ఇక్కడ గణవేషలో స్వయంసేవకులతో ఖండ్ లేదా నగర్ స్థాయి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సందర్భంగా సర్ సంఘచాలక్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
2. నవంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు “హర్ గావ్, హర్ బస్తీ-ఘర్-ఘర్” (ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం, ఇంటి నుండి ఇంటికి) అనే ఇతివృత్తంతో మూడు వారాల పాటు పెద్ద ఎత్తున ఇంటింటికి సంప్రదింపు ప్రచారాన్ని యోజన చేశారు. స్థానిక శాఖల ద్వారా సంఘ సాహిత్యం పంపిణీ చేస్తారు. కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
3. అన్ని మండల్ లేదా బస్తీలలో హిందూ సమ్మేళనాలను వివక్ష లేకుండా అందరి దైనందిన జీవితంలో ఐక్యత, సామరస్యం, దేశ లక్ష్యానికి ప్రతి ఒక్కరి సహకారం, పంచ పరివర్తన్‌లో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం అనే సందేశంతో నిర్వహిస్తారు. 
 
4. సామరస్యంగా జీవించడం గురించి ప్రాధాన్యతనిస్తూ ఖాండ్/నగర స్థాయిలో సామాజిక సద్భావ సమావేశాలు నిర్వస్తారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొన్న మహాకుంభ్ ఉదాహరణగా సాంస్కృతిక పునాదులు, హిందూ స్వభావాన్ని కోల్పోకుండా ఆధునిక జీవితాన్ని గడపడం గురించి కూడా ఈ సమావేశాల ఎజెండా.
 
5. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పౌరుల సంభాషణలు నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమస్యలపై సరైన కథనాలను ఏర్పాటు చేయడంపై, నేటి సమాజంలో ప్రబలంగా ఉన్న తప్పుడు కథనాలను పక్కన పెట్టడంపై దృష్టి సారిస్తారు. 
 
6. యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రాంత విభాగాలు యోజన  చేస్తాయి. 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం అనేక కార్యక్రమాలు చేబడతారు. ఇవి దేశ నిర్మాణ కార్యకలాపాలు, సేవా కార్యకలాపాలు, పంచ పరివర్తనపై దృష్టి సారిస్తాయి. స్థానిక శాఖల అవసరానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను యోజన చేస్తారు. 
 
కాగా, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలనే హిందూ సంస్థల డిమాండ్‌పై అడిగిన ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలే సమాధానమిస్తూ, వక్ఫ్ భూములను ఆక్రమించడం వల్ల చాలా మంది రైతులు కూడా ప్రభావితమయ్యారని చెప్పారు.  ప్రభుత్వం ఒక పరిష్కారం కోసం కృషి చేస్తోందని చెబుతూ తప్పులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
 
ఔరంగజేబ్ గురించి ప్రస్తావిస్తూ సమాజం, దేశం శ్రేయస్సుకు చిహ్నాలుగా ఉన్నవారు మన ఆదర్శాలుగా ఉండాలి గాని,  అసహనానికి పేరుగాంచిన, ఈ దేశం నైతికతకు ప్రాతినిధ్యం వహించని వారు కాదని ఆయన తేల్చి చెప్పారు. ఔరంగజేబు లాంటి వారిని వ్యతిరేకించడం మతపరమైనది కాదని, దేశ ప్రయోజనాలకు, ఐక్యతకు సంబంధించినదని తెలిపారు.
 
1947లో మనం రాజకీయ స్వేచ్ఛ పొందినప్పటికీ, మానసిక వలస పాలకుల ప్రభావం నిర్మూలన నేటికీ ఒక వాస్తవం అని పేర్కొంటూ మనస్సుకు సంబంధించిన  వలస భావన తత్వాన్ని నిర్మూలన చాలా అవసరం అని సూచించారు.  మతం ఆధారంగా రిజర్వేషన్లపై ఒక ప్రశ్నకు, కోర్టులు అనేకసార్లు ప్రభుత్వ చర్యలను పక్కన పెట్టాయని గుర్తు చేశారు.  అవి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ అలాంటి రాజకీయ చర్యలతో ముందుకు సాగే వారెవరైనా రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లే అని ఆయన స్పష్టం చేశారు. 
 
ప్రస్తుత జాతీయ పరిస్థితిపై, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితి సంఘ్ తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం తమ అంచనా ఆధారంగా కొన్ని చర్యలు తీసుకుందని, మణిపూర్ ప్రజల జీవితాలు సాధారణ స్థితికి తిరిగి రావడానికి, సామరస్యంగా జీవించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సంఘ్ చెప్పిందని పేర్కొన్నారు.