భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా (49) కన్నుమూశారు. ఆయన వయసు 49 ఏళ్లు. భారత షూటర్ మనూ బాకర్‌కు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో ఆయన గతంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. భారతీయ పిస్తోల్ షూటర్లకు కోచ్‌గా కొనసాగుతున్న జస్పాల్ రాణా అనూహ్య రీతిలో తుదిశ్వాస విడిచారు. రానాకు భార్య రీనా రానా, కుమార్తె దేవాంశి, కుమారుడు యువరాజ్, తండ్రి నారాయణ్ సింగ్ రానా, ఇద్దరు తోబుట్టువులు సుష్మా సింగ్, సుభాష్ రానా ఉన్నారు.
తర్వాతి తరం షూటర్ల అభివృద్ధికి, వారి అభివృద్ధికి చేసిన కృషికి గాను రానాకు 2020లో ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు లభించింది. జర్మనీలోని మునిచ్ ఇటీవల జరిగిన షూటింగ్ ఈవెంట్‌కు హాజరైన జస్పాల్ రాణా అస్వస్థతకు గురయ్యాడు. 1976లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన రాణా, 1988లో అహ్మదాబాద్‌లో జరిగిన 31వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన తొలి ప్రదర్శనలోనే రజత పతకం గెలిచి జాతీయ స్థాయిలో తన మొదటి ప్రధాన మైలురాయిని సాధించారు.
ఆయన అనేక అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో స్వర్ణం గెలిచి తన కెరీర్ ప్రారంభంలోనే ఒక పెద్ద విజయాన్ని అందుకున్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆయన భారతదేశపు అత్యంత ప్రతిభావంతులైన షూటర్లలో ఒకరిగా, ముఖ్యంగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో రాణించారు. అలాగే కామన్వెల్త్ క్రీడలు మరియు ఆసియా క్రీడలలో పలుమార్లు పతకాలు సాధించారు.
2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో, ఆయన భారతదేశానికి ఆరు పతకాలను గెలుచుకున్నారు. జర్మనీ నుంచి వస్తున్న సమయంలో జస్పాల్ రాణా విమానంలోనే తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. ఢిల్లీలో దిగగానే ఆయన్ను నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు. కానీ షూటర్ రాణా ఆ చికిత్స నుంచి కోలుకోలేకపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు.
మేటి షూటర్‌గా రాణించడంతో పాటు ఉత్తమ కోచ్‌గా ఆయన అనేక ఆటగాళ్లకు మెంటర్‌గా చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్‌కు రాణా వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్.. గతంలో జాతీయ జూనియర్ కోచ్‌గా వ్యవహరించారు. అప్పుడే మను బాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు.
ఒలింపిక్స్ విజయాల అనంతరం ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్‌గా నియమితులయ్యారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తీవ్రమైన వత్తిడిలో ఉత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలన్న మెళుకువలను ఆయన నేర్పారు. తొలుత చాంపియన్‌గా, ఆ తర్వాత మేటి కోచ్‌గా జస్పాల్ రాణా ఓ చరగని ముద్ర వేసుకున్నారు. భారతీయ షూటింగ్ క్రీడా రంగ స్వరూన్నే ఆయన మార్చేశారు. ఎంతో మంది అథ్లెట్లకు ఆయన ప్రేరణగా నిలిచారు. రాణా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం తెలిపారు. “జస్పాల్ రాణా మృతి విషాదకరం. ఆయన ఒక ప్రఖ్యాత షూటర్. ఆయన అద్భుతమైన ప్రదర్శనలు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయి. ప్రపపంచ షూటింగ్ పోటీలలో అనేక పతకాలు గెలుచుకున్న ఆయన, భారత క్రీడా రంగంలో దిగ్గజంగా నిలిచారు. ఒక క్రీడాకారుడిగా, మార్గదర్శకుడిగా, యువ ప్రతిభను తీర్చిదిద్దడంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేశారు” అని రాష్ట్రపతి ఓ సందేశంలో సంతాపం తెలిపారు.
“ఆయన అంకితభావం, క్రమశిక్షణ, క్రీడారంగం పట్ల తనకున్న నిబద్ధత రాబోయే తరతరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా సమాజానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆయన మరణం “భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటు” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో రాణా కుటుంబానికి, స్నేహితులకు, యావత్ క్రీడా ప్రపంచానికి తన ప్రార్థనలు తోడుగా ఉంటాయని ఆయన ‘ఎక్స్’ అనే బ్లాగ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
“షూటింగ్‌లో తన అసాధారణ విజయాల ద్వారా ఆయన దేశానికి అపారమైన కీర్తిని తెచ్చిపెట్టారు. అంతే అద్భుతంగా, ఒక మార్గదర్శకుడిగా యువ క్రీడాకారులను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్ది, మార్గనిర్దేశం చేశారు. శ్రేష్ఠత, క్రమశిక్షణ పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, క్రీడా ప్రపంచానికి ఆయన చేసిన సేవ అపారమైన అభిమానాన్ని సంపాదించిపెట్టాయి,” అని ఆయన కొనియాడారు.
More Stories
మీనాక్షి నటరాజన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైల్వే కోచ్ పై రాళ్లు!
జిల్లా జీడీపీ అంచనాలను రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపు