
పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష, సంస్కృతి, మరియు ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు. అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న “పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం” పేరును తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం తెలుగు భాషను, కోట్ల మంది తెలుగువారి గౌరవాన్ని అవమానించే చర్య అని బిజెపి ఏపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్సించారు.
కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబం తప్ప ఏ స్వాతంత్ర్య సమరయోధుల గౌరవించడం తెలియదని ఆయన ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి, తెలుగువారి గౌరవంగా నిలిచిన పీవీ నరసింహరావు వరకు స్వంత పార్టీ కాంగ్రెస్ నేతలను సైతం ఎవ్వరినీ గౌరవించలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే ద్వేషంతో, తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పేరును ఆయన జన్మదినానే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారిపై చూపుతున్న బాద్యతా రాహిత్య చర్యలకు ఓక నిదర్శనం అని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాస్వామ్యవాదివైతే, హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చగలరా? అని విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, తెలుగు ప్రజలను కించపరిచే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి తెలుగు బిడ్డ ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. బీజేపీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పొట్టి శ్రీరాములు గారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పై పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరుమారుస్తూ మంత్రి దామోదరం రాజనరసింహ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధించుకున్నారు.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం