* సైనిక దుస్తుల్లో కుర్స్క్ పర్యటనతో పుతిన్ సంకేతం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆలోచన సరైనదేనని, తాము కచ్చితంగా మద్దతిస్తామని చెప్పారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై అమెరికాతోనూ, ఇతర భాగస్వాములతోనూ చర్చించవలసి ఉందని స్పష్టం చేశారు.
ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని నియంత్రించే యంత్రాంగం ఉండాలని పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించే 30 రోజులను ఉక్రెయిన్ తన సైన్యాల మోహరింపు, ఆయుధాల సేకరణల కోసం ఉపయోగించుకుంటుందా? అనేది ఓ సమస్య అని తెలిపారు. కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారి తీయాలని, సంక్షోభానికి మూల కారణాలను నిర్మూలించాలని చెప్పారు. అంతేగాని టీ బ్రేక్ గా మారకూడదని తేల్చి చెప్పారు.
కాగా, ఉక్రెయిన్ సరిహద్దు వద్ద ఉన్న కుర్స్క్ ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం పర్యటించారు. ఆ పర్యటన చేపట్టిన సమయంలో పుతిన్ సైనిక దుస్తుల్లో కనిపించారు. గత మూడేళ్ళలో మొదటిసారిగా సైనిక దుస్తువులలో కనిపించిన ఆయన ఫ్రంట్‌లైన్‌లో ఆయన ఆ దుస్తులతో వెళ్లడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న కుర్క్క్ ప్రాంతంలో పుతిన్ ఉన్నట్లు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
కుర్స్క్ లో పర్యటించిన పుతిన్ ధైర్యసాహాసాలను నిపుణులు మెచ్చుకున్నారు. చాలా ప్రమాదకరమైన ప్రాంతంలో ఆయన పర్యటించినట్లు కొందరు పేర్కొన్నారు. కర్స్క్ పశ్చిమప్రాంతం నుండి వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టాలని ఉన్నత కమాండర్లను ఆయన ఆదేశించారు. బుధవారం కర్స్క్ చేరుకున్న ఆయన అక్కడ టెలివిజన్ ప్రసంగించారు.
మరో వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలుమార్లు ఫ్రంట్‌లైన్‌లో పర్యటనలు జరిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ పాటించేందుకు జెలెన్‌స్కీ అంగీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో ఆ ఒప్పందం కుదిరింది.
అయితే ఈ ఒప్పందాన్ని పుతిన్ అంగీకరిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు పుతిన్ సిద్ధంగా లేరని, అందుకే ఆయన సైనిక దుస్తుల్లో కనిపించారని సంకేతాలు వెలువడుతున్నాయి. తమవైపు ఎవ్వరు కన్నెత్తి చూసినా యుద్దానికి సిద్ధమనే సంకేతం ఐరోపా దేశాలకు ఇచ్చేందుకే ఆయన ఈ పర్యటన జరిపినట్లు భావిస్తున్నారు.
కుర్స్క్ ప్రాంతంలో సుజా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధికారులు చెప్పారు. సమీప భవిష్యత్తులో సాధ్యమైనంత తక్కువ సమయంలో కర్స్క్ ప్రాంతంలో స్థిరపడిన శత్రువును నిర్ణయాత్మకంగా ఓడించడమే తమ కర్తవ్యమని పుతిన్ చెప్పారు. వాస్తవానికి సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.
కర్స్క్‌లో ఒకప్పుడు ఆక్రమించుకున్న 86శాతం భూభాగం కంటే ఎక్కువ భూభాగం నుండి తమ సైన్యం ఉక్రెయిన్ దళాలను బయటకు నెట్టాయని రష్యా జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ కోసం జరిగే చర్చల్లో కర్స్క్‌ను పావుగా ఉపయోగించుకోవాలన్న ఉక్రెయిన్ ప్రణాళిక విఫలమైందని ఆయన చెప్పారు.
గత ఐదురోజుల్లో రష్యన్ దళాలు ఉక్రెయిన్ సైన్యం నుండి 24 స్థావరాలను, 259 చదరపు కిలోమీటర్ల భూమిని, 400 మందికి పైగా ఖైదీలతో సహా తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. కాగా, చాన్నాళ్ల తర్వాత సైనిక దుస్తుల్లో కనిపించిన పుతిన్ చాలా హుషారుగా ఉన్నారు. ఉక్రెయిన్‌లోని డోనస్కీ ప్రాంతంలో తాజాగా రష్యా జరిపిన దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత