
మన వృత్తులను మనం కాపాడుకోలేకపోతే, ఈ వృత్తులు చేసేవాళ్లని పరస్పరం గౌరవించుకోకపోతే, ఆ వృత్తులు చేసుకోవడానికి నామోషీ పడితే ఇతర మతస్థులు ఆ వృత్తులను చేపట్టి, ఆ వృత్తిదారుల సంప్రదాయ, సంస్కృతులను గౌరవించరని సామాజిక సమరసత అఖిల భారత సంయోజక్, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు కె శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు.
శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని కమలానగర్ లో చేతి వృత్తులు- చిరు వ్యాపారుల సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ గతిలేక వారినే మన ఇళ్లలోకి పిలుచుకోవాల్సిన దుర్భర పరిస్థితులు మొదలయాయని చెప్పారు. మన పిల్లలు చదువుకున్నా వృత్తిని నేర్చుకోవడం, దానిపట్ల గౌరవం ఉండాలని స్పష్టం చేశారు.
అంతేగాక కులానికి సంబంధించిన వారేకాక ఇతర మతాల వారికి బదులు ఆసక్తి ఉన్న ఇతర హిందూకులాల వారు కూడా ఆయా వృత్తులను స్వీకరిస్తే మన సంస్కృతీ సభ్యతలు నిలబడతాయని ఆయన తెలిపారు. మన ఇళ్లలో జరిగే ఉత్సవాల్లో కూడా నాదస్వరం, గంగిరెద్దులాట, మిగతా వృత్తుల వాళ్లను పిలిచి, వారికి కూడ బట్టలు పెట్టడం, అందరితో కలిపి భోజనాలు పెట్టడం చేయాలని, పరస్పరం గౌరవించుకోవాలని ఆయన సూచించారు.
అంత్యక్రియలలో కూడ ఏ రకమైన భేషజాలూ లేకుండ పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. ఇతరమతస్థులకి మన ఇళ్లలోకి వచ్చి మన ఆడవారి భద్రతకు ముప్పుతెచ్చుకొనే పరిస్థితులు తెచ్చుకోవద్దని శ్యామప్రసాద్ హెచ్చరించారు. మన వృత్తుల్ని కాపాడుకుంటూ మనం కలిసి ఉండాలని ఆయన ఉద్బోధించారు. సమావేశంలో విశ్వకర్మ, నాయి బ్రాహ్మణ, పద్మశాలి, మేస్త్రీ , గంగిరెద్దుల వారు, మాలదాసరి, రజక, మేదరి, వీధి వ్యాపారులు, మొదలైన వృత్తుల వారు పాల్గొన్నారు.
సమావేశంలో వివిధ వృత్తులలో ఎదురు అవుతున్న సమస్యలు, వాటిని అధిగమించడానికి చేయవలసిన పనుల గురించి విస్తృతంగా చర్చించారు.
సమస్యల పరిష్కారం దిశగా ప్రగతిని సమీక్షించడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి కలవాలని నిర్ణయించారు.
బిఎంఎస్ నాయకులు రవిశంకర్ రకరకాల చట్టాల వివరాలు, ఆర్థిక ప్రయోజనాలు వివరించారు. జనహిత గణేశ్ యనమండ్ర జనహిత ద్వారా ఇచ్చే ఉచిత వృత్తి శిక్షణలు, సహాయక్ యాప్ ద్వారా మన హిందువులే మన యిళ్లలో రకరకాల రిపేర్స్ (ఏసి, ఫ్రిడ్జ్, వాటర్ ఫిల్టర్స్, ఎలక్ట్రికల్,మరి అన్నివిధాల గృహోప పనులను వివరించారు. సమితి అధ్యక్షులు రేమెళ్ల వేంకటేశ్వర్లు, భాగ్ సంఘచాలక్ డా. కె. నాగమోహన్ , క్షేత్ర ప్రచార ప్రముఖ్ గొట్టుముక్కల భాస్కర్ కూడ పాల్గొన్నారు
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు