గగనతలంలో గేమ్ ఛేంజర్ గా భావించే అత్యాధునిక ఎఫ్ -35 ఫైటర్ జెట్ లను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ప్రకటించడంతో అటు పాకిస్థాన్, ఇటు చైనా ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ ఫైటర్ జెట్ భారత అమ్ములపొదిలో చేరితే అమెరికా లాగే భారత్ కూడా రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని భారత్ భావిస్తోంది.
అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35 ఫైటర్ జెట్. ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో ఈ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు భారతీయులను కన్ను తిప్పుకోకుండా చేసింది. ఐదో తరానికి చెందిన ఈ ఫైటర్ జెట్ ను అమెరికా చాలా తక్కువ దేశాలకు సరఫరా చేసింది. ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధవిమానాల్లో ఎఫ్-35 ఫైటర్ జెట్ ఒకటి.
అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎఫ్- 35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఎంతో సన్నిహిత దేశాలకు కూడ అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవడం లేదు. రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేసిందన నాటో కూటమి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించబోమని గతంలో అమెరికా తేల్చి చెప్పింది. అలాంటిద ఎస్ -400 వాడుతున్న భారత్‌కు వీటిని అమ్మాలని భావించడం గమనార్హం.
ఈ ఫైటర్ జెట్ గంటకు 2,000 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లగలదు. రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సత్తా ఈ ఫైటర్ జెట్ సొంతం. ఈ యుద్ధ విమానం రన్ వే అవసరం లేకుండానే నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది. అలాగే కిందకు దిగుతుంది. దీని ధర ప్రస్తుతం రూ. 695 కోట్ల నుంచి రూ. 990 కోట్ల వరకు ఉంటుంది. ఈ యుద్ధ విమానాన్ని నడిపేటప్పుడు ఫైలట్ ధరించే హెల్మెట్ ధర రూ. 3.50 కోట్ల వరకు ఉంటుందట.
ఈ ఫైటర్ జెట్లలో ఎస్ -135 ఇంజిన్‌ను వినియోగిస్తారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. రాడర్లలో అతిచిన్న సిగ్నేచర్‌ను మాత్రమే సృష్టిస్తుంది. దానిన ఏదో పక్షి అనుకొని శత్రుసైన్యం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పుతుంది. దీని కాక్‌పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది.
మిగిలిన ఫైటర్ జెట్ల వలే దీనిలో వివిధ రకాల పరికరాలు, ఇతరాలు ఉండవు. భారీ టచ్‌స్క్రీన్‌లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్లకు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్‌టైమ్ ఇన్ఫర్మేషన్‌ను అందిస్తాయి. ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్‌తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు. ఎఫ్- 35 యుద్ధవిమానాల కొనుగోలు ఖర్చుతో పాటు దీని నిర్వహణకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరిత 36 వేల డాలర్లు ఖర్చవుతుంది. దీనికి తోడ ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం, మౌలిక సదుపాయలు వంటివి కూడా భారీ వ్యయంతో కూడుకున్నవి. అంతే కాకుండా ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం ఉంటుంది.
ఈ విమాన తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకొన్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌కు మాత్రం వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ అమ్ములపొదిలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి. ఇవి 4.5 జనరేషన్‌గా భావిస్తారు. ఇవి గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూఉపరితలం పైకి దాడులు చేయగలవు. కాకపోతే ఎస్ -35 స్థాయి టెక్నాలజీ వీటిల్లో లేదు. ప్రస్తుతం 4.5 జనరేషన్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోన్న భారత్ అమెరికా ఆఫర్‌ను అంగీకరిస్తే రక్షణ రంగంలో మరింత బలోపేతం అవుతుంది.
భారత్ ఇప్పటివరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. కానీ, ఎఫ్ -35 విమానాలు అమ్ములపొదిలోకి వస్తే మాస్కో నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాల్సి రావొచ్చు. దీనిని సమతుల్యం చేసుకోవడం భారత్ సవాల్‌గా మారే అవకాశం ఉంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత