
తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెఫీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తులకు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీస్ అంటే దేశ విభజన జరిగిన తర్వాత భారత్ నుంచి విడిపోయి పాకిస్థాన్, చైనా వెళ్లిపోయిన వారి ఆస్తులు వివరాలుపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్వాల్‌గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్‌పై పురోగతి ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా పురోగతిని వివరించారు.
కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి పొజిషన్‌లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదికను అందించాలని బండి సంజయ్ సూచించారు.
“తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమీ ప్రాపర్టీస్‌పై సమీక్ష నిర్వహించాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నాను. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీస్‌పై వివరాలను అధికారులను అడిగితే, చాలా ప్రాంతాల్లో ఈ భూములను ఆక్రమించుకున్నారు. మరికొన్ని చోట్ల అనేక సమస్యలు వచ్చాయి. ఈ ప్రాపర్టీస్‌పై మార్చి నెలాఖరులోపు సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదిక అందించాలని అధికారులను కోరాం” అని సంజయ్ తెలిపారు.
గతంలో పాకిస్తాన్‌లో యుద్ధం సందర్భంగా ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అట్లాగే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారు. అయితే ఆ ఆస్తులు పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుంది. కాగా, 1947లో జరిగిన భారత విభజన సమయంలో, ఆ స్థలాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ముస్లిం, హిందూ, సిఖ్ లు తమ భూములు, ఆస్తులు వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఎంతోమంది వారి ఆస్తులను వదిలిపోయారు లేదా వివాదాలు ఎదుర్కొన్నారు.
పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఈ ఆస్తులను విక్రయించడం, వారి స్వంత హక్కులను రక్షించుకోవడానికి పోరాడే స్థితి ఎక్కువ. అక్కడి అధికారుల సహకారంతో, ఆస్తుల విక్రయాలు జరిగాయి. అయితే ఈ పరిణామాలు చాలా రాజకీయ, చారిత్రిక పరమైన సమస్యలు తలెత్తించాయి.
ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పైరవీలు, నకిలీ పత్రాలు లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. 10 శాతం ఉన్న ముస్లింలను బీసీల్లో కలిపితే కేంద్రం ఒప్పుకోదని స్పష్టంగా చెప్పారు. బీసీలను 51 శాతం నుంచి 46 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వమే మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
10 శాతం ముస్లింలను తీసుకొని వస్తే కేంద్రం ఒప్పుకుంటుందని వివరించారు. హిందువుల జనాభా తగ్గించి ముస్లిం జనాభా పెంచి చూపిస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు