
కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి బాలీవుడ్ నటి మమతా కులకర్ణ చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఇటీవల ఒక వీడియోలో తన రాజీనామాను ఆమె ప్రకటించగా, తాజాగా తన రాజీనామా తిరస్కరణకు గురైనట్టు శుక్రవారంనాడు మరో వీడియోను ఆమె షేర్ చేశారు.
అఖండాల్లో కీలక స్థానమైన మహామండలేశ్వర్ హోదాను 52 ఏళ్ల మమతా కులకర్ణి పొందడంతో సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన వెంటనే ఆమె అత్యున్నత స్థానమైన మహా మండలేశ్వర్ హోదాను పొందడం పట్ల సభ్యుల్లో పలువురు వ్యతిరేకించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్లు ఫిబ్రవరి 10న మమతా కులకర్ణి ప్రకటించారు. తాను సన్యాసినిగానే కొనసాగుతానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా కులకర్ణి మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. మహామండలేశ్వర్ గా తన రాజీనామా ఆమోదం పొందలేదని ప్రకటించారు. ఆచార్య లక్ష్మీనారాయణ తనను ఆ హోదాలో ఉంచినందుకు కృతజ్ఞురాలిని అంటూ వీడియోలో వెల్లడించారు. తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
”రెండ్రోజుల క్రితం కొందరు మా గురువుగారైన డాక్టర్ ఆచార్య లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిపై తప్పుడు ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా నేను రాజీనామా చేశాను. అయితే, ఆయన నా రాజీనామాను అంగీకరించలేదు. పదవిలోనే ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అఖాడాకు, సనాతన ధర్మ పరిరక్షణకు పునరంకితం అవుతున్నాను” అని ఆమె చెప్పారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం