
* ఢిల్లీ సచివాలయానికి తాళం
ఢిల్లీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపు ఖాయం చేసుకోవడాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రజల శక్తి అత్యున్నతమని తెలిపారు. “అభివృద్ధి గెలిచింది, సుపరిపాలన గెలిచింది. బిజెపికి చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఢిల్లీ లోని నా సోదరసోదరీమణులందరికీ నా వందనం అభినందనలు!” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
“నాకు ఇచ్చిన అపారమైన ఆశీర్వాదాలు, ప్రేమకు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞుడను. ఢిల్లీ అభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలుకోం. ఇది మా హామీ. దీనితో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మేము భావిస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.
“ఈ తీర్పు కోసం పగలు రాత్రి పనిచేసిన నా బీజేపీ కార్యకర్తలందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు మేము మా ఢిల్లీ వాసులకు మరింత అంకితభావంతో సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాము” అని ట్వీట్ చేశారు.
పదేళ్లుగా ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆప్‌పై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినపుడు ఫైళ్లు చోరీకి గురవుతూ ఉంటాయి. ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ’ఎక్స్’ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఢిల్లీ ప్రజలు చెప్పారు. వారి ఓట్లతో, ప్రజలు మురికి యమునా, మురికి తాగునీరు, విరిగిన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ప్రతి వీధిలో తెరిచిన మద్యం దుకాణాలపై స్పందించారు’ అంటూ ఆప్ పై ధ్వజమెత్తారు.
“ఢిల్లీలో ఈ మహా విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ లకు నా హృదయపూర్వక అభినందనలు. మహిళల పట్ల గౌరవం, అనధికార కాలనీ నివాసితుల ఆత్మగౌరవం, స్వయం ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్న ఢిల్లీలో.. ఇక ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన రాజధానిగా మారనుంది” అంటూ ట్వీట్ చేశారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?