
భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసిన పలువురు పాకిస్థానీలపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపి వారి కుట్రను భగ్నం చేసింది. ఈ కాల్పుల్లో మొత్తం 12 మంది చనిపోగా, వారిలో ముగ్గురు పాకిస్థానీ ఆర్మీ సిబ్బందిగా అధికారులు భావిస్తున్నారు. అలాగే మిగతా వారంతా ఉగ్రవాదులు అని అంచనా వేస్తున్నారు.
జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో గల కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఫిబ్రవరి 4వ తేదీ అర్థరాత్రి ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
పూంచ్ జిల్లాలోని బత్తల్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలి మరో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మరణించారు. నియంత్రణ రేఖను దాటి భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌పై సైన్యం మెరుపు దాడికి పాల్పడింది.ఈక్రమంలోనే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరగ్గా ఏడుగురు చొరబాటు దారులు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే మృతుల్లో ఇద్దరు నుంచి ముగ్గురు పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది ఉండగా, మిగతా వారంతా ఉగ్రవాదులు అని చెప్పింది. అయితే వారు అల్ బదర్ గ్రూపునకు చెందిన సభ్యులు అని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉండగా, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మార్గంలో వెళ్తామని చెప్పిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. కశ్మీర్ సహా భారత్‌తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవలే ఈ కార్యక్రమంలో చెప్పారు.
జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో “కశ్మీర్ సంఘీభావ దినం” పేరుతో సంయుక్త సదస్సు నిర్వహించినట్లు సమాచారం. దీనికి హమాస్ కూడా హాజరు అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే భారత నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. తమపై దాడి జరిపేందుకు ప్రయత్నించిన పాకిస్థానీల చర్యను అడ్డుకుని ఏడుగురిని మట్టుబెట్టాయి.
మరోవైపు జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని బత్తల్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలి ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత వైపునకు ఉగ్రవాదులు కంచె దాడుతున్న సమయంలో మందుపాతర పేలింది. ఓ ఉగ్రవాది ల్యాండ్‌మైన్ మీద కాలివేయడంతో ఈ సంఘటన జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల వద్ద ఐఈడీ కూడా ఉందని ల్యాండ్‌మైన్‌తోపాటు ఐఈడీ కూడా పేలిపోయినట్లు వెల్లడించారు. భారత్‍లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా ఇండియన్ ఆర్మీ.. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత