
1989లో రామ జన్మభూమి ఉద్యమంలో కీలక నాయకుడు, అయోధ్యలో రామ మందిరానికి మొదటి పునాది రాయి వేసిన `తొలి కరసేవక్’ కామేశ్వర్ చౌపాల్ శుక్రవారం ఢిల్లీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ అయినా సుపాల్ దళిత నాయకుడు. 2002 నుండి 2014 వరకు బీహార్ శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు
2014లో సుపాల్ బిజెపి అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. చౌపాల్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనను రాముడి అంకితభావంతో కూడిన అనుచరుడిగా ప్రశంసించారు. రామ మందిర నిర్మాణానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఎక్స్ లో ఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా రాశారు: “సీనియర్ బిజెపి నాయకుడు, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ జీ మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన రామునికి అంకితభావంతో కూడిన అనుచరుడు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విలువైన కృషి చేశారు” అని తెలిపారు.
“దళిత నేపథ్యం నుండి వచ్చిన కామేశ్వర్ జీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో, ఆయన కుటుంబం, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!”
1989లో రామాలయానికి జరిగిన చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమంలో చౌపాల్ పోషించిన ముఖ్యమైన పాత్రను గుర్తుచేసుకుంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఆయన జీవితమంతా మతపరమైన, సామాజిక పనులకు అంకితం చేయబడింది” అని చెప్పారు. చౌపాల్ ఆత్మ శాంతి కోసం రాముడికి ప్రార్థనలు చేస్తూ యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
“వి హెచ్ పి కేంద్ర ఉపాధ్యక్షుడు, బీహార్ రాష్ట్ర గౌరవనీయ అధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, రెండు సార్లు ఎమేల్సి, శ్రీ రామ్ లాలా మందిర్ మొదటి ఇటుకను వేసిన శ్రీ కామేశ్వర్ చౌపాల్ జీ మరణం చాలా విచారకరం, దిగ్భ్రాంతికరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఉపశమనం కలగాలని మనమందరం దేవుడిని ప్రార్థిస్తున్నాము.” అని తెలిపారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. చౌపాల్ చేసిన కృషిని, రామజన్మభూమి ఉద్యమానికి ఆయన జీవితాంతం చేసిన అంకితభావాన్ని గుర్తుచేసుకున్నారు. “దేవుడు ఆయన ఆత్మకు ఆయన పాదపద్మములలో స్థానం కల్పించాలని , ఆయన ప్రియమైనవారికి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
“చౌపాల్ మరణం ఆయన మద్దతుదారుల హృదయాలలో శాశ్వత శూన్యతను మిగిల్చింది, కానీ ఆయన చేసిన కృషి, ముఖ్యంగా దళిత వర్గాలకు సాధికారత కల్పించడంలో, చారిత్రాత్మక రామజన్మభూమి ఉద్యమంలో ఆయన పాత్ర, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అంటూ విశ్వహిందూ పరిషత్ సంతాపం తెలిపింది.
కామేశ్వర్ చౌపాల్ బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందినవారు. 1989 నవంబర్ 9, 1989న రామజన్మభూమి మందిర్ పునాది కోసం మొదటి ‘రామ్ శిలా’ (ఇటుక) వేయడానికి ఎంపికైనప్పుడు ఆయన ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. ఆ సమయంలో, ఆయన విశ్వ హిందూ పరిషత్ కి అంకితభావంతో పనిచేసేవారు. మందిర్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
రామమందిర ఉద్యమంలో సమాజంలోని ప్రతి వర్గం యొక్క సహకారాన్ని గుర్తిస్తూ, సమగ్రతకు సందేశంగా ఆయన ఎంపిక ముఖ్యమైనది. ఆయన అధికారికంగా 1982లో వి హెచ్ పి లో చేరారు. 1989 నాటికి, గయ నుండి పనిచేస్తున్న బీహార్‌లోని సంస్థ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో, ‘రామ్ శిల’ ప్రచారం భారతదేశం అంతటా ఉన్న గ్రామాల నుండి ఇటుకలను సమీకరించింది, ప్రతి గ్రామం మందిర నిర్మాణం కోసం ఒక ఇటుక, దక్షిణగా రూ. 1.25 విరాళంగా సేకరించారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?