సుపరిపాలన, పారదర్శక పాలన, రియల్ టైం గవర్నెన్స్ … ఇవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఊత పదాలు. ప్రభుత్వంలో ఫిజికల్ ఫైల్స్ సిస్టం పోయే చాలా సంవత్సరాలే అయింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్లోనే డిజిటల్ సిగ్నేచర్ తోనే ఫైల్స్ క్లియర్ చేయవచ్చు. దీనికి ఆఫీస్ లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి, బయటకు వెళ్లినా కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేయవచ్చు.
కానీ మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారులో ఫైల్స్ క్లియర్ అవుతున్న తీరు చూస్తే అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి మంత్రులకు ఫైల్స్ క్లియర్ చేసేంత తీరిక లేకుండా ఏమి చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయించకమానదు. తమ దగ్గరకు వచ్చే ఫైల్స్ ను వెంటనే క్లియర్ చేయటం, వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే వెనక్కి పంపి వివరణలు తీసుకుని పరిష్కరించాలి.
గురువారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి చంద్రబాబు మంత్రుల ర్యాంకింగ్స్ బయటపెట్టారు. ఇందులో విచిత్రం ఏమిటి అంటే అత్యంత కీలకమైన రెవిన్యూ, ఆర్థిక, హోమ్ శాఖల మంత్రులు ఈ జాబితాలో చివరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉండటం మరో విశేషం. ఫైల్స్ క్లియరెన్స్‌లో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉంటే.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు.
ఇక మంత్రులు వరుసగా.. కందుల దుర్గేష్ (2), కొండపల్లి శ్రీనివాస్ (3), నాదెండ్ల మనోహర్ (4), డోలా బాల వీరాంజనేయులు (5), సీఎం చంద్రబాబు (6), సత్యకుమార్ (7), లోకేష్ (8), బీసీ జనార్థన్ రెడ్డి (9), పవన్ కల్యాణ్ (10), సవిత (11), కొల్లు రవీంద్ర (12), గొట్టిపాటి రవికుమార్ (13), నారాయణ (14), టీజీ భరత్ (15), ఆనం రామనారాయణరెడ్డి (16), అచ్చెన్నాయుడు (17), రాంప్రసాద్ రెడ్డి (18), గుమ్మడి సంధ్యారాణి (19), వంగలపూడి అనిత (20), అనగాని సత్యప్రసాద్ (21), నిమ్మల రామానాయుడు (22), కొలుసు పార్థసారధి (23), పయ్యావుల కేశవ్ (24), చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.
తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్‌లో వెనుకబడి ఉంటే ఎలా? అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
More Stories
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?
ఎపి ప్రభుత్వ సలహాదారులుగా సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల