
ఒకవైపు మంత్రుల సమావేశం జరుగుతుండగానే, మ రోవైపు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏమీ కాదని, ఒక ఎమ్మెల్యే డిన్నర్ ఇచ్చారని, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు. అంతేకాకుండా, ఆ భేటీని ‘టీ కప్పులో తుఫాన్’గా అభివర్ణించారు. కాగా, ఇప్పటికే సీఎంకు, ఒకరిద్దరు మం త్రులకు, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు మధ్య పొసగడంలేదనే ప్రచారం జరుగుతున్నది.
వీటికితోడు రసహ్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు. మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు.
ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ వద్దకు ఈ అంశం చేరినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్కు రానున్నట్టు సమాచారం. రహస్యభేటీలో ఇప్పటివరకు తెరపైకిరాని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తనకూ ‘మెసేజ్’ వచ్చిందని, కానీ దానిని తాను చూసుకోలేదని పేర్కొన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి