అంతా అయిపోయి, ఖజానా ఖాళీ అయ్యాక గానీ ఎల్ఐసీ బ్రాంచ్ నిర్వాహకులకు అసలు విషయం బోధపడలేదు. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
భద్రాచలం బ్రాంచ్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరగడం సాధ్యమేనా? నకిలీ పత్రాలతో వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి తిప్పించే అధికారులు, ఈ కేటుగాళ్లకు ఎలా సహకరించారు? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

More Stories
గాంధీ భవన్ ముట్టడికి పిలుపు.. బిజెపి నాయకుల అరెస్ట్
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం