
ఈ క్రమంలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు దానిని అడ్డుకునేందుకు పావులు కదిపారు. ఇందులో భాగంగానే మూడు జిల్లాలకు చెందిన భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్పుర్-పూజారీ కాంకేర్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టయి.
మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండున్నర గంటలపాటు భీకర పోరు జరిగినట్లు తెలుస్తున్నది. నలువైపులా చుట్టుముట్టిన జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు.
కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టారు. కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తున్నది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 12 బోర్ తుపాకీ, రెండు సింగిల్ షాట్ తుపాకులు, ఒక బీజీఎల్ లాంచర్, నాటు తుపాకీతోపాటు మందుగుండు, ఇతర వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం తెలిపారు.
ఎన్‌కౌంటర్ ఘటనతో ఒక్కసారిగా ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తమై అడవులను జల్లెడ పడుతున్నాయి.
మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
మరోవంక, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలైన ఘటన బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జవాన్లు చప్టా మీదకు రాగానే దాని కింద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
మరోవైపు మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ కేర్లపాల్(దర్భా డివిజన్ కమిటీ)కి చెందిన ఏరియా కమిటీ సభ్యురాలు కలుము పాయి పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి చెంది పోలీసుల ఎదుట లొంగిపోయారు.
More Stories
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యతో ఒడిశా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలు కొట్టిపారేసిన సిబిఎస్ఇ
2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు, చైనా 120 కోట్లు