బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడి దాడి

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడి దాడి
 
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై  గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు.

అయితే ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని సమాచారం. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి దొంగ అయ్యిండచ్చని వారు అనుమానిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్​ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడని, అయితే ఇది గమనించిన సైఫ్​ అతడితో ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సైఫ్‌ను ఆ వ్యక్తి గాయపరిచినట్లు తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులు ైఫ్​ను ్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆస్పత్రికి తరలించారు. 

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ నివాసంలోకి ప్రవేశించాడని తెలుస్తోంది. ఈ సంఘటనలో కత్తితో జరిగిన ఘర్షణలో సైఫ్ గాయపడినట్లు తెలుస్తోంది.  వైద్యులు సర్జరీ చేస్తున్నారనీ, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తామని  పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.
 
వెన్నుమొకలోనూ గాయమైందని అంటున్నారు. లీలావతి డాక్టర్ నీరజ్ ఉత్తమని చెప్పిన దాని ప్రకారం సైఫ్ అలీ ఖాన్‌ ఇంట్లోనే ఈ దాడి జరిగింది. ఉదయం 3 గంటల 30 నిమిషాలకు హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. అయితే అప్పటికే ఆయన ఒంటి మీద చాలా గాయాలున్నాయి. రెండు గాయాలు చాలా లోతుగా అయ్యాయి. ఒకటి ఆయన వెన్నుమొకకు దగ్గరగా జరిగింది. పూర్తి చికిత్స తరువాతే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలం అని ఆ వైద్యులు తెలిపారు.