కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. అక్కడ నాయకత్వ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి, ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్ఠానం ప్రతిపాదించిన ఫార్ములాయే ఇదని, దాని ప్రకారమే అధికార మార్పిడి చోటుచేసుకుంటుందని పార్టీలోని ఒక సీనియర్ నేత తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి, ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్ఠానం ప్రతిపాదించిన ఫార్ములాయే ఇదని, దాని ప్రకారమే అధికార మార్పిడి చోటుచేసుకుంటుందని పార్టీలోని ఒక సీనియర్ నేత తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్ది ర్టీ ై కమాండ్ ఆదేశించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. ఈనెల 13వ తేదీన బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్ సహా తదితరులు హాజరయ్యారు.
అయితే, తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ‘నా కుర్చీ ఖాళీ లేదు. నా పదవి భద్రంగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని, కానీ కొందరు పాత్రికేయులు పనిగట్టుకుని తనను తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదని ఆయన స్పష్టం చేశారు.
ఒక పక్క కర్ణాటకలో సీఎంను మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ దళితుడినైన తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ ప్రశ్నించారు. ‘నేను దళితుడిని, దళితులు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు? నేనెందుకు ఆ పదవిని చేపట్టకూడదు. నేను ముఖ్యమంత్రిని అయితే ఎవరు అభ్యంతరం చెబుతారు?’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు.
More Stories
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం