
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేసింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు.
ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని, కేటీఆర్ ఒక్క రూపాయి తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఏ ఎలా వర్తిస్తుందని.. ఇందులో పీసీ యాక్ట్ 13(1A) వర్తించనే వర్తించదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు.
వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం కోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్ట్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
More Stories
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!
చార్ ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు
అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు