ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2025 సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభ్యం కానుంది.
కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 4కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. డీఏపీ ఎరువుల సబ్సీడీకి అదనంగా రూ.3,850 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి గతేడాది వరకు, అంటే 2024 చివరి వరకు ఎరువుల సబ్సీడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది.
అదే విధంగా 2024లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకున్న. దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు వివరించారు.
ఇక పంటల బీమా కోసం 50శాతం ప్రీమియంను కేంద్రం చెల్లించేందుకు కేబినేట్ అంగీకరించింది. ఈశాన్య రాష్ట్రాలకు ఈ ప్రీమియం 90 శాతంగా నిర్ణయించారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ. 800 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోదాహరణగా వివరించారు.
కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు భేటీ అయిన ఈ తొలి కేబినెట్‌ను రైతులకు అంకితం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించిందిని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
More Stories
భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కుంభమేళాతో ఉత్తర ప్రదేశ్ కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం