అంతకుముందు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చారు. హైదర్‌గూడ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న డిమాండ్‌తో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
మరోవంక, అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు.
కేటీఆర్, హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – అదానీ ఫొటో ముద్రించిన టీషర్టులు ధరించిన తమను అసెంబ్లీలో అనుమతించకపోవడంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ గేట వద్ద నిరసన చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపలకి అదానీ, రేవంత్ ఫొటోతో టీషర్టులు తొలగించి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయినా ఆ టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పడంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేశారు.
ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులకు జోహార్.. వీరులకు జోహార్ అంటూ పాటపాడారు.
More Stories
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!