విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కిలో మీటర్లు మేర మొదటి కారిడార్, గురుద్వార్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.08 కిలో మీటర్ల మేర రెండో కారిడార్, 6.75 కిలోమీటర్ల మేర తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు మూడో కారిడార్ నిర్మించనున్నారు. తొలిదశకు 11,498 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67 కిలోమీటర్ల మేర నాలుగో కారిడార్‌గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో పెరిగిన రద్దీ నగరానికి ఇబ్బంది తెస్తోంది. ఒక్క మెట్రో మాత్రమే కాకుండా ఏక కాలంలో పై వంతెనలు కూడా నిర్మించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో, మద్దిలపాలెం, తాడిచెట్లపాలెంలో పై వంతెనలు నిర్మించాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి