ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ గురుకుల పాఠశాలల్లో 51 మంది విద్యార్థులు చనిపోయారని, 23 మంది అభశుభం తెలియని విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని, 10 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారని, నలుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో, 14 మంది అనారోగ్యంతో చనిపోయారని అంటూ డా. వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని, రాష్ట్రంలో 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఆ శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉంటె, సంక్షేమ హాస్టళ్లలో ప్రతిపక్షాలు కుట్రచేసి పిల్లల్ని చంపేస్తున్నరంటూ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉండటం పట్ల డా. కాసం విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. .
పిల్లలు చనిపోయేంతవరకు వస్తుంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయింది? అని బిజెపి నేత ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడు లేనంతగా సీఎం రేవంత్ సొంత జిల్లా నారాయణపేటలోని ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే మూడుసార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ఆకునూరి మురళి, కోదండరాం వంటి విద్యావేత్తలు ఎందుకు స్పందించడం లేదు? కనీసం హాస్టళ్లను కూడా సందర్శించడం లేదే? అని ఆయన నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుతో గచ్చిబౌలి కేశవనగర్‌లో ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు కూడా లేవని, సౌకర్యాలు లేవని దత్తత తీసుకుని కోటి రూపాయల నిధులిచ్చి, మొసలికన్నీరు కార్చారంటూ ఆ ఒక్క స్కూల్ తప్పితే మిగతా స్కూళ్లలో సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.
ఇప్పుడు కేసీఆర్ దారిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని స్పష్టం చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై తామెందుకు కారణమంటూ రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడారని బిజెపి నేత గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను గాలికొదిలేసి పాలనను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి మంత్రి పదవులిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని డా. వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని పదవులిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లడం కొత్త వ్యవహారమేమీ కాదని స్పష్టం చేశారు. పరిపాలనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలవి ఒకే తీరని తెలిపారు
ఖమ్మంలో రైతులకు బేడీలేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బేడీలేసి జైలుకు పంపిస్తున్నదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో నాసిరకం పురుగుల బియ్యం పెడుతూ విద్యార్థులను అనారోగ్యంపాల్జేస్తున్నరని డా. వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీని లాకౌట్ చేసి బంధిస్తున్నదని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి శిక్ష పడకుండా కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని రక్షిస్తున్నదని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట అవినీతి జరిగిందని ఢంకా బకాయించి చెప్పి, అవినీతి సొమ్ము కక్కిస్తానని రేవంత్ రెడ్డి మాటలు చెప్పిండని ఆయన గుర్తు చేశారు ఏడాది పాలనలో ఇంతవరకు దోషులెవ్వరినీ జైలుకు పంపించలేదే అని ప్రశ్నించారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం