భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదిని రువాండా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రప్పించింది. రహస్య ఆపరేషన్‌లో భాగంగా కిగాలీలోని ఇంటర్‌పోల్ ఆ ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించింది. పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధాలున్న ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మిలిటెంట్ మాడ్యూల్స్‌కు నిధులు, ఆయుధాల సరఫరాకు సహకరించాడు.
కాగా, గత ఏడాది బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో భారీగా ఆయుధాలను పోలీసులు గుర్తించారు. ఏడు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక మ్యాగజైన్, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. 2023 అక్టోబర్ 25న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఈ కేసు దర్యాప్తు స్వీకరించింది. సల్మాన్ రెహ్మాన్ ఖాన్ కీలకమైన నిందితుడిగా గుర్తించింది.
మరోవైపు సీబీఐ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఆగస్టు 2న ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. దీంతో నిఘా సమాచారం ద్వారా సల్మాన్ రెహ్మాన్ ఖాన్ రువాండాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ బృందం ఆ దేశానికి వెళ్లింది. దర్యాప్తు కోసం అతడ్ని భారత్‌కు తీసుకువచ్చింది.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం