కే-4 మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత్ తెలిపింది. అయితే ఈ మిస్సైల్ వ్యవస్థకు చెందిన మరిన్ని పరీక్షలను నేవీ నిర్వహించనున్నది. భారత నౌకాదళంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్ జలాంతర్గాములు ఉన్నాయి. ఆ రెండు సబ్‌మెరైన్ల నుంచి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించవచ్చు.
అరిఘాట్ సబ్‌మెరైన్‌ను ఆగస్టులో జలప్రవేశం చేశారు. విశాఖపట్టణంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఆ జలాంతర్గామి జలప్రవేశం చేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మూడవ జలాంతర్గామి వచ్చే ఏడాది నేవీ దళంలో చేరనున్నది.
ఐఎన్ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం అయిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లోని ‘నౌకా నిర్మాణ కేంద్రం’ లో 2011 డిసెంబర్ లో చేపట్టారు. నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జలప్రవేశం చేయించారు. తర్వాత అంతర్గత పరికరాలు బిగించారు. ఆధునిక సాంకేతిక రాడార్ వ్యవస్థను అమర్చారు.
ప్రపంచవ్యాప్తంగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగల జలాంతర్గాములు ఉన్న దేశాల్లో భారత్ ఆరోది. అమెరికా, రష్యా, యూకె, ఫ్రాన్స్, చైనా వంటివి ఇతర దేశాలు. చైనాను దృష్టిలో పెట్టుకుని భారత్ 3500 కిమీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను రూపొందించింది.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం