ఆరు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లోని ఆరు స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) పేర్కొంది. ఎపిలో మూడు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఇసి పేర్కొంది. డిసెంబర్ 20న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. అదే రోజు 5.00 గంటలకు ఓట్ల లెక్కింపు ఉండనుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామాలతో రాజ్యసభలో సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సుజీత్ కుమార్ రాజీనామాతో ఒడిస్సాలో, జవహర్ సిర్కార్ రాజీనామాతో పశ్చిమబెంగాల్‌లో, క్రిషన్‌లాల్ పన్వార్ రాజీనామాతో హర్యానాలో ఉపఎన్నిక అనివార్యమైంది.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్