అమెరికాలో అరెస్టు వారెంట్ తో  భారీ నష్టాల్లో అదానీ షేర్లు

అమెరికాలో అరెస్టు వారెంట్ తో  భారీ నష్టాల్లో అదానీ షేర్లు

ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా మోపిన అభియోగాల ప్రభావం అదానీ కంపెనీల స్టాక్స్​పై పడింది. దీంతో గురువారం ప్రారంభ ట్రేడింగ్​లో అదానీ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్, అదానీ ఎనర్జీ స్టాక్స్​ 20 శాతం పడిపోయింది. సొలార్​ ఎనర్జీ కాంట్రాక్టులను చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ భారత అధికారులకు దాదాపు 250 మిలియన్ డాలర్లు లంచం చెల్లించిందని అమెరికా ఆరోపించింది.

265 మిలియ‌న్ల డాల‌ర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు  అరెస్టు వారెంట్ జారీ  చేసింది.  20 ఏళ్ల‌లో దాదాపు రెండు బిలియ‌న్ల డాల‌ర్ల (దాదాపు రూ.1.68 లక్షల కోట్లు) లాభం వ‌చ్చే సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భార‌తీయ ప్ర‌భుత్వ అధికారుల‌కు గౌతం అదానీతో పాటు మ‌రో ఏడు మంది సుమారు 265 మిలియన్‌ డాలర్ల ముడుపులు ఇవ్వ‌చూపిన‌ట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగ‌ర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగ‌ర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జ‌డ్జి జారీ చేశారు. ప్రాసిక్యూట‌ర్లు ఆ వారెంట్‌ను విదేశీ న్యాయ‌శాఖ‌కు అంద‌జేయ‌నున్నారు.

అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం, అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అదానీ సహా మరో ఏడుగురు తప్పుడు స్టేట్‌ మెంట్లు, ప్రకటనల ద్వారా లబ్ధి పొందినట్లు అధికారులు గుర్తించారు. 

ఈ క్రమంలో మిలియన్ డాలర్ల లంచం, మోసానికి సంబంధిన ఆరోపణలపై గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేశ్ అగర్వాల్ వంటి వారిపై అభియోగాలు నమోదయ్యాయి. అమెరికా డాల‌ర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియ‌న్ల డాల‌ర్లు స‌మ‌కూర్చాల‌ని అదానీ గ్రీన్ ఎన‌ర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను ర‌ద్దు చేసింది.

అరెస్టు వారెంట్ జారీ నేప‌థ్యంల అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను ర‌ద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎన‌ర్జీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అమెరికా పెట్టుబ‌డీదారుల‌ను, అధికారుల‌ను మోసం చేసిన‌ట్లు గౌతం అదానీపై అభియోగాలు న‌మోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ క‌మీష‌న్ ఆ అభియోగాలు చేసింది.

మరోవైపు, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ అదానీ గ్రీన్ ఎనర్జీపై అభియోగాలు మోపింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది.

ఈ క్రమంలో సెన్సెక్స్ స్టాక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో సహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్‌ సైతం ప్రారంభ ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి.

అదానీ ప్లాగ్​షిప్ కంపెనీ- అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 19.17 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 18.14 శాతం, అదానీ పవర్ 17.79 శాతం, అదానీ పోర్ట్‌లు 17.79 శాతం మేర క్షీణించాయి. అంబుజా సిమెంట్స్ 14.99 శాతం, ఏసీసీ 14.54 శాతం, ఎన్​డీటీవీ 14.37 శాతం, అదానీ విల్మార్ 10, వీటితో పాటు అదానీ గ్రూపునకు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.