భూతాపాన్ని తగ్గించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్-కాప్) – 29 సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగించారు. దాదాపు 200 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
రాబోయే రెండు రోజుల్లో 75 దేశాలకు పైగా అధినేతలు హాజరు కావచ్చని భావిస్తున్నారు. అయితే కాలుష్యాన్ని పెద్దయెత్తున విడిచిపెడుతున్న అమెరికా వంటి సంపన్న దేశాల నేతలు కొందరు ముఖం చాటేసే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. రెండవ రోజు మంగళవారం జరిగిన సదస్సులో ఐరాస చీఫ్ గుటెరస్ ప్రసంగిస్తూ సమయం మించిపోతోందని, తక్షణమే భూతాప నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? తక్షణ కార్యాచరణకు నడుం బిగించకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అధ్వానంగా మారుతున్న దశలో సత్వర కార్యాచరణకు నడుం బిగించాలని కోరారు. భూ మండల ఉష్ణోగ్రతలు మరింత వినాశకరమైన రీతిలో పెరగకుండా అడ్డుకునేందుకు సమయం మించి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వాతావరణ నిధి విషయంలో ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలి, లేని పక్షంలో మానవాళి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సివస్తుందని హెచ్చరించారు.
ఇటువంటి ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న వాతావరణ సదస్సుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్, చైనా అధినేత జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ వంటి ప్రముఖ నాయకులు గైర్హాజరవ్వడం పట్ల వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీరి గైరాజర్ వల్ల సత్వర కార్యాచరణ విషయంలో ఐక్యతపై అనిశ్చిత నెలకొందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడం ఈ దఫా వాతావరణ చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసిందని వారు విశ్లేషించారు. ఇప్పటికైనా సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ సిమన్ స్టీల్ ప్రపంచ అగ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.
సదస్సు ప్రారంభం అట్టహాసంగా జరిగినప్పటికీ అధికార ఎజెండా మాత్రం గంటల తరబడి ఆలస్యమైంది. అనంతరం సోమవారం సాయంత్రం అంతర్జాతీయ కార్బన్ మార్కెట్‌కుకొత్త యుఎన్ ప్రమాణాలను ప్రభుత్వాలు ఆమోదించాయి. అంతర్జాతీయ కార్బన్ మార్కెట్‌ను ఖరారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఎనాుళ్ళగానో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సదస్సులో దేశాలు దానికి అనుకూలంగా ఓటు వేశాయి.
ఈ కార్బన్ మార్కెట్ ఏర్పాటు, దేశాలు తమ వాతావరణ లక్ష్యాలను ఎదుర్కొనే దిశగా ట్రేడ్ కార్బన్ క్రెడిట్ – అంటే కర్బన ఉద్గారాలకు సంబంధించి ధృవీకరించిన తగ్గింపు – లను ఇవ్వడానికి కీలకమైన చర్యగా పరిగణిస్తున్నారు. పారిస్ ఒప్పందంలో అర్టికల్ 6గా పిలిచే సెక్షన్ ద్వారా ఈ మార్కెట్ రూపొందింది. దేశాలు కర్బన ఉద్గారాలను తమలో తాము ఎలా ట్రేడ్ చేసుకోగలవో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
పారదర్శకత, సమగ్రతపై మరింతగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరింత పరిపక్వతతో కూడిన కార్బన్ మార్కెట్‌ను అందించడమే కాకుండా తన వాతావరణ నిధుల ఆకాంక్షలను మరింత ఉత్తేజితపరిచేందుకు భారత్‌కు ఒక అవకాశం దొరికింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, టర్కీలతో సహా జి-20 దేశాల్లో పలు దేశాలు వాతావరణ కార్యాచరణను గణనీయంగా పెంచాల్సిన అవసరం వుందనిక్లైమేట్ అకౌంటబిలిటీ మాట్రిక్స్ (సిఎఎం) పేర్కొంది. ఈ సదస్సులో దీనిు ప్రారంభించారు. వాతావరణ అంశాల్లో దేశాల పనితీరును విశ్లేషించేందుకు ప్రపంచ వర్ధమాన దేశాల నుండి వచ్చిన తొలి అంచనా సాధనమే ఈ సిఎఎం.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు