దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. “ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు” అని విశ్లేషించింది.
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందిన అమిత్‌షా, ఈ జాబితాలో దేశంలో మూడో శక్తిమంత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రికి కళ్లు, చెవుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం తీసుకొనే ప్రతీ నిర్ణయం ఆయన ఆమోదం తర్వాతే ముందుకెళ్తోంది. వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్‌పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్‌గాంధీ గుర్తింపు పొందారు.
దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి, జైలుకెళ్లినా 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా ఎగిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమిపార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో టిడిపిని రెండో పెద్దపార్టీగా నిలపగలిగారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు, రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు. తర్వాతి స్థానాల్లో బిహార్ సీఎం నీతీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరులున్నారు.
“ముఖ్యమంత్రులలో, నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్‌లుగా ఎదిగారు. మోదీ ప్రభుత్వం వారిపై ఆధారపడటం నుండి ప్రభావం చూపింది. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తమ గడ్డపై బిజెపి ప్రవేశాన్ని అడ్డుకుంటూ తమ ప్రాంతీయ ప్రాధాన్యతను పటిష్ట పరుచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిని సగానికి తగ్గించిన ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్, సమాఖ్య అధికారం వైపు ఈ వంపుని ధృవీకరిస్తున్నారు. అయితే, మేము ఆయనను సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రిందనే ఉంచాము, ఎక్కువ విషయాలు మారితే, అవి కూడా అలాగే ఉంటాయి” అని ఇండియా టుడే పేర్కొన్నది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం