బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో మాట్లాడి, పరిస్థితిని వారికి వివరించి, రైతులను ఆదుకోవాలని కోరారు.
కిషన్ రెడ్డి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి. పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాదీ పాటించనుంది. ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఈసారీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.7350 చొప్పున సీసీఐ కొనుగోలు చేయనుంది.
పత్తి రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు సృష్టించే తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మి దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు, మిల్లర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. ఇప్పటి వరకు సాఫీగా సాగిన కొనుగోళ్లు సోమవారం పత్తిని కొనుగోలు చేసేది లే దం టూ జిన్నింగ్‌లను బంద్ పెట్టారు.
ఉదయం 6గంటల నుంచే వందలాది మంది రైతు లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు భారీ గా పత్తిని తీసుకువచ్చారు.కొనుగోళ్లు ఆపేయడంతో పత్తి మార్కెట్‌లో రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పత్తిలో తేమ పేరుతో సీసీ ఐ మెలికపెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు నిలివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు భైంసా-నిర్మల్ నేషనల్ హై వేపై రాస్తారోకో నిర్వహించారు. పత్తి రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడిం ది. ఖచ్చితంగా పత్తి కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేశారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?