మరోసారి జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. పార్లమెంటు చరిత్రలో అరుదైన రీతిలో రనాఫ్ రౌండ్‌లో ఆయన ఎన్నికయ్యారు. దీంతో ఆయన నేతృత్వంలో మైనార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ప్రతిపక్ష కూటమి నుంచి ఆయనకు ఈ సారి గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. కొత్త ప్రధాని ఎన్నిక దగ్గర నుంచే ప్రతిఘటన మొదలైంది. ప్రధాన మంత్రి పదవి కోసం పలువురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
మొత్తం 465 స్థానాలు ఉన్న పార్లమెంటులో సాధారణ మెజార్టీకి అవసరమైన 233 ఓట్లు ఎవరికీ లభించలేదు. దీంతో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య రనాఫ్ ఎన్నిక నిర్వహించగా, ఇషిబాకు 221 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, ప్రధాన ప్రతిపక్షమైన జపాన్ కానిస్టిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు యోషి హికో నోడాకు 160 ఓట్లు లభించాయి. 84 ఓట్లు చెల్లనివిగా పరిగణించడంతో ఇషిబాను విజేతగా ప్రకటించారు.
కాగా, గత నెల 27న జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఇషిబా నేతృత్వంలోని పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి), జూనియర్ భాగస్వామి కొమెటో మెజారిటీని కోల్పోయాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఎల్‌డిపి వైఫల్యంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఈ ఫలితాల్లో ప్రతిబింబించింది. జపాన్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ముగిసిన 30రోజుల్లోగా కొత్త నేతను ఎన్నుకోవాల్సి వుంది. అందుకోసం ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు.. గత కేబినెట్ సభ్యుల్లో చాలామందిని తిరిగి నియమించే అవకాశాలు వున్నాయి. ఎన్నికల్లో ఓడినా ఇషిబా గద్దె దిగడానికి తిరస్కరించారు.
ఇకపోతే ఎక్స్‌లో విజయాన్ని ప్రకటించిన ఇషిబా, “నేను జపాన్‌కు 103వ ప్రధానమంత్రిగా నియమితులయ్యాను. ఈ క్లిష్ట దేశీయ, అంతర్జాతీయ వాతావరణంలో, దేశానికి, దాని ప్రజలకు సేవ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను” అని పోస్ట్ చేశారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన రన్‌ఆఫ్ ఓటింగ్‌లో, 67 ఏళ్ల ఇషిబా 221 ఓట్లను పొందారు. 233 మెజారిటీ థ్రెషోల్డ్‌కు తగ్గినప్పటికీ నోడాను అధిగమించి దేశ 103వ ప్రధానమంత్రి అయ్యారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు