షేక్ హసీనాను అప్పగించమని కోరటం లేదన్న యూనుస్

షేక్ హసీనాను అప్పగించమని కోరటం లేదన్న యూనుస్

భారతదేశం నుండి షేక్ హసీనాను అప్పగించాలని కోరే ఆలోచన ప్రస్తుతం తమ దేశానికి లేదని  బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని దేశంలో తిరుగుబాటు తర్వాత ఆగస్టులో ఢాకా నుండి భారతదేశానికి పారిపో,యారు. ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, హసీనాపై ఉన్న కేసులపై దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (బంగ్లాదేశ్) తీర్పు వచ్చిన తర్వాతే బంగ్లాదేశ్ హసీనా తిరిగి రావాలని కోరుతుందని యూనుస్ తెలిపారు. 

అక్టోబర్‌లో ఆమెపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. “మానవత్వానికి వ్యతిరేకంగా ఆమెపై నేరారోపణలు ఉన్నాయి. తీర్పు వెలువడిన తర్వాత, భారత్‌తో ఉన్న అప్పగింత ఒప్పందం ద్వారా ఆమెను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం” అని ఆయన చెప్పారు. “తీర్పు వెలువడకముందే మేము అలా చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.” అని స్పష్టం చేశారు. 

కాగా, అప్పగింత అభ్యర్థనను ఆలస్యం చేయడంపై ప్రభుత్వ వైఖరి బంగ్లాదేశ్, భారతదేశం మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను నివారించడానికి ఒక వ్యూహంగా కూడా పరిగణించబడుతుంది.ఒకవంక తాత్కాలిక ప్రభుత్వం నిలదొక్కుకోకుండా భారత్ తో దౌత్యపరమైన ప్రతిష్టంభనకు యూనస్ సిద్ధంగా లేరని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా యూనస్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను కూడా నిందించారు. పార్టీ ఫాసిజం యొక్క అన్ని లక్షణాలను ప్రదర్శిస్తుందని, ఇప్పుడు దేశ రాజకీయాల్లో దానికి స్థానం లేదని విమర్శించారు. అయితే, తన తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ భవిష్యత్ ను నిర్ణయించలేదని,  ఎందుకంటే ఇది రాజకీయ ప్రభుత్వం కాదని ఆయన గుర్తు చేశారు. 

భవిష్యత్ ఎన్నికలలో లీగ్ పాల్గొనవచ్చా లేదా అనే దానిపై ఏదైనా నిర్ణయం రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయించబడుతుందని యూనస్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఉన్నత స్థాయి అధికారులపై విచారణ జరిపి శిక్షించే వ్యవస్థ తరచూ సమస్యాత్మకంగా ఉండడంతో హసీనాను దోషిగా నిర్ధారించడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

లిఖిత పూర్వక ఆధారాలు లేకపోవడంతో నిరసనల సందర్భంగా విద్యార్థులపై కాల్పులు జరపాలని హసీనా చట్ట అమలు సంస్థలను ఆదేశించినట్లు నిరూపించడం కష్టమని న్యాయ నిపుణులు అంటున్నారు. సాక్ష్యం తగినంతగా ఉన్నప్పటికీ, అవామీ లీగ్‌లో హసీనాకు ఇప్పటికీ బలమైన మద్దతు ఉన్నందున రాజకీయ అవరోధాల ద్వారా నేరారోపణను అడ్డుకోవచ్చు.

ది డిప్లొమాట్ ప్రకారం, ఆమె మద్దతుదారులు హసీనా, ఆమె వారసత్వంపై వ్యక్తిగత దాడిగా ఆమె ప్రాసిక్యూషన్‌ను ప్రదర్శించవచ్చు.  వారి మధ్య హింస, అశాంతిని ప్రేరేపిస్తుంది. ఇది బంగ్లాదేశ్ పెళుసైన ప్రజాస్వామ్య ఫాబ్రిక్‌ను ప్రభావితం చేసే దేశంలో రాజకీయ ధ్రువణతపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.  పైగా, హసీనా రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పంచుకున్నందున, భారతదేశం, చైనాలతో సహా పొరుగు దేశాల నుండి కూడా ఒత్తిడి ఉండవచ్చు. ఇలా ఉండగా, హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడీ చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించారు.