ఐపీఎల్ వేలానికి పంత్, రాహుల్, అయ్య‌ర్

ఐపీఎల్ వేలానికి పంత్, రాహుల్, అయ్య‌ర్
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ రిటెన్ష‌న్ జాబితా వ‌చ్చేసింది. ప‌ది జ‌ట్లు త‌మ‌కు న‌మ్మ‌క‌మైన ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే అట్టిపెట్టుకున్నాయి. అంద‌రూ ఊహించిన‌ట్టే ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిష‌భ్ పంత్‌ ను వ‌దిలేసింది. ల‌క్నో సూపర్ జెయింట్స్ సైతం సార‌థి కేఎల్ రాహుల్‌ ను స్క్వాడ్ నుంచి విడుద‌ల చేయ‌గా, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌మ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గుడ్ బై చెప్పేసింది.
దాంతో, ఈ ముగ్గురు 18 సీజ‌న్ మెగా వేలంలో భారీ ధ‌ర ప‌లికే అవ‌కాశ ముంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధ‌మైంది. మిడిలార్డర్‌లో దంచికొట్టే ర‌జ‌త్ పాటిదార్‌ను రూ. 11 కోట్ల‌కు, యువ‌పేస‌ర్ య‌శ్ ద‌యాల్‌ను రూ. 5 కోట్ల‌కురిటైన్ చేసుకుంది. ఐపీఎల్ లో చెల‌రేగిపోయే హెన్రిచ్ క్లాసెన్ రికార్డు ధ‌ర ప‌లికాడు. అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఏకంగా 23 కోట్ల‌కు అట్టిపెట్టుకుంది.
ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ రిష‌భ్ పంత్‌ను వ‌దిలేయ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను వ‌ద్ద‌నుకుంది. అక్ష ర్ ప‌టేల్‌ను రూ.16.5 కోట్ల‌కు అట్టి పెట్టుకుంది. స్టార్ స్పిన్ర్ కుల్దీప్ యాద‌వ్, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌ల‌ను అట్టిపెట్టుకుంది. ల‌క్నో విష‌యానికొస్తే.. పూరన్‌కు రూ.21 కోట్లు, బిష్ణోయ్, మ‌యాంక్‌ల‌కు త‌లా రూ.`11 కోట్లు చెల్లించ‌నుంది.
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ క‌మిన్స్, అభిషేక్ శ‌ర్మ‌, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్
ముంబై ఇండియ‌న్స్ – రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, సూర్య‌కుమార్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా
చెన్నై సూప‌ర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్, ర‌వీంద్ర జ‌డేజా, శివం దూబే, ఎంఎస్ ధోనీ.
రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – విరాట్ కోహ్లీ, ర‌జ‌త్ పాటిదార్, య‌శ్ ద‌యాల్.
కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ – రింకూ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఆండ్రూ ర‌స్సెల్, సునీల్ న‌రైన్, ర‌మ‌న్‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రానా.
ఢిల్లీ క్యాపిట‌ల్స్ – అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, అభిషేక్ పొరెల్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – సంజూ శాంస‌న్, య‌శ‌స్వీ జైస్వాల్, అశ్విన్, రియాన్ ప‌రాగ్, ధ్రువ్ జురెల్
గుజ‌రాత్ టైటాన్స్ – ర‌షీద్ ఖాన్, శుభ్‌మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – నికోల‌స్ పూరన్, ర‌వి బిష్ణోయ్, మ‌యాంక్ యాద‌వ్, అయుశ్ బ‌దొని, మొహ్సిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్ – శ‌శాంక్ సింగ్, ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్,