అక్టోబర్ లో రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

అక్టోబర్ లో రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు నెలకొల్పాయి. దేశీయ విక్రయాలు పుంజుకోవడంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు తొమ్మిది శాతం వృద్ధి చెంది రూ.1.87 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇది రెండో గరిష్టం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్లు వసూలు కావడమే గరిష్టం.
ఇక గత నెల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.99,111 కోట్లు, సెస్ రూ.12,550 కోట్లు వసూళ్లయ్యాయి.

గత నెలలో జీఎస్టీ వసూళ్లు 8.9 శాతం పెరిగి రూ.1,87,346 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో రూ.17.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ వసూళ్లు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి ద్వారా రూ.45,096 కోట్లు వసూలయ్యాయి. 2023-24తో పోలిస్తే గత నెలలో రీఫండ్స్ 18.2 శాతం పెరిగి రూ.19,306 కోట్లకు చేరాయి.

రీఫండ్స్ సర్దుబాట్లతో నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి.గతేడాదిలో అక్టోబర్‌తో పోలిస్తే 9 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో రూ 1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి.   సెప్టెంబర్‌ నెలలో 40 నెలల కనిష్ట స్థాయి 6.5 శాతం నుండి అక్టోబర్‌లో 8.9 శాతానికి వృద్ధి పుంజుకోవడంతో, రెండవ అత్యధిక నెలవారీ వసూళ్లుగా రికార్డు నమోదైంది.

సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి, ఐజిఎస్‌టి, సెస్‌ అక్టోబర్‌లో పెరిగినట్లు  నివేదిక పేర్కొంది.2024లో ఇప్పటివరకు, మొత్తం జిఎస్‌టి వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.12.74 లక్షల కోట్లకు చేరాయి. 2023లో ఇదే సమయంలో రూ.11.64 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిఎస్‌టి రికార్డు గరిష్ట స్థాయి రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.

2023-24 ఆర్థిక సంవత్సరంలో,  స్థూల జిఎస్‌టి వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం పెరుగుదలతో రూ. 20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.దేశీయ లావాదేవీల నుండి  జిఎస్‌టి  10.6 శాతం  వృద్ధి  చెంది రూ.1.42 లక్షల కోట్లకు చేరుకుంది, అయితే అక్టోబర్‌ 2024లో దిగుమతులపై పన్ను దాదాపు 4 శాతం  పెరిగి రూ.45,096 కోట్లకు చేరుకుంది.