పీఎం స్వనిధి స్కీమ్ లో రూ.50 వేల వరకు రుణాలు

పీఎం స్వనిధి స్కీమ్ లో రూ.50 వేల వరకు రుణాలు
వీధి వ్యాపారులకు రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పెట్టుబడి రుణాలు అందించేందుకు పీఎం స్వనిధి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. 
 
ఈ పథకాన్ని జూన్ 1, 2020న కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైక్రో క్రెడిట్ స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కోసం ఆన్ లైన్ లో అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని ఆధార్ ఆధారిత ఈ-కెవైసి  ద్వారా తెలుసుకోవచ్చు. 
 
అలాగే దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా దరఖాస్తు స్టేటస్ తెలియజేస్తారు. ఈ పథకంలో మూడు విడతలుగా రుణాలను అందిస్తారు. మొదటి విడత రూ. 10,000, మొదటి విడత రుణం పూర్తిగా చెల్లించిన వారికి రెండో విడతలో రూ. 20,000, రెండో విడత రుణం చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 50,000 రుణాలు అందిస్తారు.
 
పీఎం స్వనిది  వెబ్‌సైట్ ప్రకారం మే 3, 2024 నాటికి మొదటి విడతగా 69.06 లక్షలు, రెండో విడతగా 22.91 లక్షలు, మూడో విడతలో 4.79 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. వీధి వ్యాపారులు ఈ పథకం కింద రుణాలకు నేరుగా పీఎం స్వనిది పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .

ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందించడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తుంది. ఈ రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లిస్తే, సంవత్సరానికి 7% వడ్డీ రాయితీ అందిస్తారు. నిర్థిష్ట డిజిటల్ లావాదేవీలు చేపట్టే వారికి ఏడాదికి రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్‌కు అర్హులు. ఈ స్కీమ్ దరఖాస్తుకు ముందుగా దరఖాస్తుకు అవసరమైన వివరాలు, ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్, పథకం నిబంధనల ప్రకారం అర్హత స్థితిని తనిఖీ చేయండి.