కానీ ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో భాగం కాదని బీపీడీబీ వర్గాలు తెలిపాయి. డాలర్ల కొరత వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడానికి మరో కారణం అని ఆ వర్గాల కథనం. ఫలితంగా అక్టోబర్ 31 నుంచి జార్ఖండ్ లోని గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1496 మెగావాట్ల విద్యుత్ బదులు 724 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసింది.
ఇటీవల రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ లో ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. గత నెలలో సుమారు 90 మిలియన్ల డాలర్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అదానీ పవర్ కు బీపీడీబీ చెల్లించినట్లు సమాచారం. నెలవారీ 90-100 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లులకు కేవలం 20-50 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్లే బకాయిలు పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్ పవర్ సంస్థలు పవర్ పర్చేజింగ్ తగ్గించుకుంటున్నాయి. ఎన్టీపీసీతోకూడిన జాయింట్ వెంచర్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్ షిప్ పవర్ కంపెనీ సైతం బొగ్గు కొరత వల్ల సగానికంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. అదానీ పవర్ తయారు చేసే విద్యుత్ మీద యూనిట్ కు రూ.10-12 పలుకుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గుతో తయారు చేస్తున్న విద్యుత్ చార్జీలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం